OKA THARAM TELUGU KATHA by D.RAMALINGAM book cover

OKA THARAM TELUGU KATHA

by D.RAMALINGAM

₹180
In stock · 1 available
PublisherSAHITYA ACADEMI
LanguageTelugu
తెలగు కథ పుట్టి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి సరిగ్గా నలభై రెండేళ్ళు పట్టింది. క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చిన ఈ ప్రక్రియ విస్తృతంగా వ్యాపించింది. కవిత్వానికి కూడా లేని పాఠక ప్రపంచాన్ని సృష్టించు కుంది. ఎంతో మంది రచయితల చేతుల్లో మహోన్నత శిఖరాలకు చేరింది. సామాజిక వేగాన్ని కూడా పుంజుకోవడం ఈ తరం తెలుగు కథ ప్రత్యేకత! ఈ సంకలనంలో ముప్పయారు కథలున్నాయి. కథపై ఆయా రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలూ ఉన్నాయి. కళను విస్మరించకుండానే సామాజిక దృక్పధాన్ని ప్రస్ఫుటం చేసే ఆవేదన, జీవితవు లోతుల్ని చిత్రించగలిగే ఆర్ద్రతగల ఈ కథలు, ఒక్కోచోట పరిష్కార చైతన్యాన్ని కూడా అందించగలి గాయి. సమకాలీన తెలుగు రచయితల రచనా ప్రతిభకు సూచిక, సాహిత్య అకాడెమీ ప్రచురించిన ఈ మూడవ తెలుగు కథామాలిక! సాహిత్య అకాడెమీ కోసం, తెలుగు కథానికా సాహిత్య సమీక్షకుడు శ్రీ డి. రామలింగం 'తెలుగు కథ' అనే పేరుతో లోగడ 1988 లో ఒక సంకలనాన్ని రూపొందించారు. అది ఒక విశిష్ట ప్రయత్నమని సాహిత్యలోకం ప్రస్తుతించింది. ఇప్పడీ “ఒక తరం తెలుగు కథ" ఒక విధంగా దానికి పొడిగింపు. కథల నాణ్యతను బేరీజు వేయగల ఈ సంకలన కర్త అనుభవానికి రాణింపు. Oka Taram Telugu Katha (Telugu)