OKA YOGI PRASTHANAM by ANVIKSHIKI PUBLISHERS PVT.LTD Telugu book cover

OKA YOGI PRASTHANAM

by ANVIKSHIKI PUBLISHERS PVT.LTD

₹200
In stock · 4 available
PublisherANVIKSHIKI PUBLISHERS PVT.LTD
LanguageTelugu
ISBN9789393764089
భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్క 21వ ముఖ్యమంత్రిగా 2017 మార్చి 19న యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ పర్వత గ్రామాలలో బిడియస్తుడు, అంతర్ముఖుడు అయిన ఒక బాలుడి జీవన ప్రయాణం గురించి, కోట్ ద్వార్ లోని కళాశాలలో సైన్సు విభాగంలో ఆధునిక విద్యను అభ్యసించిన ఒక యువకుడి గురించి, తదనంతరం సన్యాసిగా మారి అకుంఠిత దీక్షతో వేదాధ్యయనం చేసిన ఒక ధార్మిక వ్యక్తి గురించి ఈ పుస్తకం కూలంకషంగా వివరిస్తుంది. తొలినాళ్ళలో పార్టీలోనే తిరుగుబాటుదారుగా ప్రారంభమయిన నేత ప్రస్తుతం భాజపాలోనే సమ్మతికి మూలస్థంభంగా ఎదిగిన క్రమాన్ని కూడా ఈ ఆత్మకథ వివరిస్తుంది. నాథ్ పంత్ సాంప్రదాయంలోని ఒక యువ సన్యాసి తన గురువు అయిన మహంత్ అవైద్య నాథ్ గారి దగ్గర రాజకీయాలలో ఎలా ఓనమాలు దిద్దుకున్నారో, ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోనే అత్యంత ఉన్నత పదవిని ఎలా అలంకరించారో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. భారత రాజకీయ ప్రహేళికలో 80 లోక్సభ స్థానాలు కలిగి, దాదాపు 22 కోట్ల జనాభా వున్న ఉత్తర ప్రదేశ్ చాలా ప్రధాన, ప్రభావవంతమయిన రాష్ట్రం. ఇప్పటికే ఎంతో మంది ప్రధాన మంత్రలను ఈ దేశానికి అందించిన ఘన చరిత కలిగిన ఉత్తర ప్రదేశ్ ఈ మోడీ శకానంతర కాలంలో యోగీ ఆదిత్య నాథ్ రూపంలో మరో ప్రధాని కాగల నేతను కూడా అందించింది అని చెప్పవచ్చు. అత్యధిక జనాభా కలిగిన అదే ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా అనితర సాధ్యమైన బాధ్యతలు చేపడుతున్న యోగి ఆదిత్య నాథ్ నిశ్చిత ఆత్మకథ ఇప్పుడు మీ చేతుల్లో పుస్తకంగా వుంది. OKA YOGI PRASTHANAM