OKARI KOKARAM by DR.T.SRI RANGA SWAMY Telugu book cover

OKARI KOKARAM

by DR.T.SRI RANGA SWAMY

₹80
In stock · 3 available
PublisherSRI LEKHA SAHITHI
LanguageTelugu
మా ధ్యేయం...ఒకరికొకరం... సమాజంలో సంస్కృతిని, సాహిత్య సంపదను పునరుజ్జీవింప చేయడం లక్ష్యంగా సాహితీ సంస్థలు నిర్విరామ కృషి చేస్తుంటాయి. సమ సమాజ ధ్యేయంగా కృషి చేస్తూ, సాహిత్య వారసత్వమును కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ, సాహితీ సదస్సులను నిర్వహించడముతోపాటుగా, సాహిత్య వనరులను ఉద్దీప్తం చేసే నిమిత్తం, రచయితలకు, కవుల రచనా శక్తికి ఇతోధికమైన చేయూతను అందిస్తూ, ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. ఈ చేయూత అనునది రకరకాలుగా ఉంటుంది. సాహిత్య సంస్థల కార్యకలాపాలలో వక్తృత్వం, రచనా శక్తిని పుష్టి చేసే నిమిత్తం, నిర్వహణలో భాగంగానే పుస్తక ప్రచురణలు, సదస్సులు ఏర్పాటు చేయడం. శ్రీలేఖ సాహితి 1977 నుండి ఈ నేపథ్యంతోనే తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది. ఉదీయమాన కవులకు తగినంత ప్రోత్సాహాన్ని అందిస్తూ, వారి రచనలను వెలుగులోకి తెచ్చేందుకు ఆయత్తము చేస్తూ వాటిని అచ్చులోకి తెచ్చాము. ఈ ప్రయత్నంలో భాగంగానే శ్రీమతి ఇందిరా చిరంజీవి, వేణుగోపాలరావు, ఎమ్మెస్సార్, గండెల చంద్రశేఖర్, సురేశ్ కుమార్, కందాళ సుదర్శన్, మహేశ్వరపు నరేందర్రెడ్డి, నళినిశోభ, హసన్, పల్లేరు కవిత మొదలగు వారి పుస్తకాలను శ్రీలేఖ సాహితీ ప్రచురణలుగా తెచ్చినది. ఔత్సాహికుల రచనా సామర్థ్యమును సాహితీ ప్రతిభను వెలికితీసేందుకు సదస్సుల్లో ప్రసంగ వ్యాసాలను సమర్పింపచేసి వాటిని సంకలనాల రూపంలో తెచ్చాము. అలా తెచ్చినవే ఏకశిల వైతాళికులు, వరంగల్లు సాహితీ తరంగాలు, వరంగల్లు సాహితీమూర్తులు, తెలంగాణ సాహిత్య స్వరూపాలు, బమ్మెర పోతన భాగవత దర్శనం, అన్నమయ్య పద వైభవం మొదలగు వ్యాస సంకలనాలు. అలాగే కవితా సంకలనాలు, కథా సంకలనాలు కూడా వారి రచనా శక్తికి ప్రతిబింబంగా శ్రీలేఖ సాహితి వెలువరించింది. శ్రీలేఖ అందిస్తున్న ప్రచురణలలో ఉదీయమానుల రచనలతో పాటు తలపండిన విద్వన్మణుల రచనలను కూడా ఒకే చోట చేకూర్చడం వలన ఆయా పుస్తకాలకు సమగ్రతను కూర్చడముతోపాటుగా వారి రచనా విధానం, వారు ఏర్పరచుకున్న మార్గమునకు మెరుగు దిద్దడం వలన ఒక స్పష్టత ఏర్పడుతుంది. వర్ధమాన కవులకు, రచయితలకు పెద్దల సరసన చోటు లభించడం వలన వారికి ఆత్మస్థైర్యము కూడా