OKARIKI OKARAI by AYYAGARI SRINIVASA RAO Telugu book cover

OKARIKI OKARAI

by AYYAGARI SRINIVASA RAO

₹60
In stock · 6 available
PublisherPOTTI SRIRAMULU TELUGU VISWAVIDYALAYAM
LanguageTelugu
ముందుమాట జె.ఎస్.మూర్తి (విహారి) ໘໖ 3: 16-11-310/12/2/1/1 మహాగణపతి టెంపుల్ స్ట్రీట్, సలీమ్ నగర్ కోలనీ -2, మలక్ పేట, హైదరాబాదు 500036 5 : 9848025600 జీవితానుభవం, అధ్యయనశీలం - కథాబలం మధ్యతరగతి కథకి అవార్డులూ, రివార్డులూ, మన్ననలేని కథాసందర్భం, -ఒక సాహితీ పరిచ్ఛేదం-నడుస్తున్న చరిత్ర ప్రస్తుత సమయం. అయితే 'మనిషి అంతరంగ చిత్రణతో సార్వకాలీనమైన జీవనసత్యాన్ని ఆవిష్కరించటం నేరమా? పాపమా? అనేది కొందరు రచయితల ఆవేదన. 'మధ్య తరగతి' సమస్యలూ, ఆనంద విషాదాలూ, 'రికార్డు' కావలసిన సామాజిక అవసరాలు కావా?' అనేది మరొక సంవేదన. 'కథ మధ్యతరగతి మనుషుల గురించే అయినా ఫర్వాలేదు కానీ ఆ కథల్లో గాఢతా, సాంద్రతా ఉండవు. అన్నీ కాలక్షేపపు బఠానీ బాపతే' అని ఒకవిసురు, "చులకన. ఇదొక- 'సీరియస్ రచయితలు' మరియు 'సీరియస్ విమర్శకులు' అనే కూటముల వారి నిర్ద్వంద్వ ప్రకటన. ఈ అవస్థల మధ్య కొందరు రచయితలు- తాముగా మధ్యతరగతి సమస్యల 'అనుభవశాలురు' కావటం వలన ఆ వర్గం వారి బతుకు వెతల్ని (లేక వైచిత్రిని) చిత్రిస్తూ పత్రికల్లో నెగ్గుకొస్తున్నారు. పాఠకుల ఆదరణనీ చూరగొంటున్నారు. మంచి రచయితలుగా వారి అభిమానాన్నీ పొంది ప్రాచుర్యం పొందుతున్నారు. అలాంటి మంచి రచయితల్లో ఒకరు అయ్యగారి శ్రీనివాసరావు గారు. బహుకథారచయిత. వ్యాసకర్త. గ్రంథకర్త. పేరు ప్రతిష్ఠా కలిగినవారు. శ్రీనివాసరావు గారి కథాసంపుటి మరొకటి వెలువడుతున్నందుకు ము మగా వారికి అభినందనలు. 'ఒకరికి ఒకరై' మీ చేతుల్లో ఉంది. ఈ సంపుటిలోని కథాంశాలు మధ్య తరగతి మనుషుల ఆంతరిక జీవలక్షణాలకి ప్రతిఫలాలుగా ఉన్నాయి. పైన పేర్కొన్న ఉపోద్ఘాతానికి కారణం అదే. మెట్టినింటి శ్రేయస్సుకు ఆయిల్లాలు (సరళ) భర్తకు ఆర్థికంగానూ, హార్దికంగానూ కూడా సహకరించటం చూస్తే (ఎదురుచూసే నయనాలు), ఆమె పరిణత మేథకూ, మంచి తనానికీ ముగ్ధులమవుతాము. తమకో చిన్న గూడుని ఏర్పాటు చేసుకోవాలనే కోరికతో పాటు ఆడపడుచు పెళ్లి గురించీ జాగ్రత్త తీసుకునే తెలివి గల ఉద్యోగిని ఆమె. చక్కని కథ. ఇలాంటి తెలివీ, గుణెన్నత్యము కలిగిన ఇల్లాలినే 'బిందువే సింధువు' కథలోనూ చూస్తాం. ఆమె విమల. మామగారికి (భర్తకి అంతగా ఇష్టం లేక బాధపడుతున్నా) నెలనెలా ఐదువందలు పంపటానికి భర్తని మోటివేట్ చేయటమే కాక, తానూ పొదుపరిగా ఉంటూ - ఒక ఇంటివాళ్లు కావటానికి దోహదం చేస్తూంది. ఆ మామగారూ నిఖార్సయిన మనిషే. కొడుకు డబ్బుని పెంచి దాన్ని తిరిగి కొడుకుకే అందజేసే మంచి మనిషి.