
OKKA PADHAM ARDHALENNO - 2
₹300
In stock · 4 available
PublisherRAJAVASIREDDY MALLESWARI
LanguageTelugu
అంటు ఎవరైన ఒక స్త్రీ బిడ్డని ప్రసవించినపుడు ఆ ఇంట్లో పురిటి మైల ఉంటుందని, పురిటి స్నానం అయ్యేదాకా ఆ మైల ఉంటుందని అంటారు. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి దినం అయ్యేంతవరకు ఆ ఇంటి పేరున్న వారికి అంటే దాయాదులకు కూడ మైల అంటే సూతకం ఉంటుందని అంటారు. సూతకం అనేది అంటు అనే పదం యొక్క ఒక అర్థం. సన్నంటుకోకు నా మాలకాకి, అంటు సొంటు లేదు, అంటు ముట్టరాని అగ్రహారం- అనే సామెతల్లోని అంటు అనే పదం అంటుకొను, ముట్టుకొను, పట్టుకొను, స్పృశించు (స్పర్శ), తాకు - అనే అర్థాలతో వాడబడింది. అంటుకోను ఆముదం లేకుంటె మీసాలకు సంపంగినూనె అంటున్నపుడు ఆముదము రాసుకొన్న అంటదు- అనే సామెతల్లో 'రాసుకొను' లేదా 'పూసుకొను' లేదా 'మర్దించటం' అని అర్ధము. కొన్ని మొక్కలు విత్తనాల ద్వారా వృద్ధి చెందితే కొమ్మల్ని అంటుకట్టడం ద్వారా కొన్ని మొక్కలు వృద్ధి చెందుతాయి. అంటు అంటే అంటుకట్టటం అని అర్థము. - ఈరు తీస్తే పేను రాదా, ఈపి లేని తావున పేలు వెతికినట్లు, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగినట్లు- అనే సామెతల్లోని 'పేను' అనేది కూడా 'అంటు' అనే పదానికున్న అర్థమే. ఈ పేలు తలలో మురికి లేదా మలినం ఉంటేనే ఎక్కువగా వస్తాయి.