OKKA VAANA CHALU by SANNAPUREDDY VENKATA RAMI REDDY Telugu book cover

OKKA VAANA CHALU

by SANNAPUREDDY VENKATA RAMI REDDY

₹110
In stock · 18 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
okka vaana chalu by sannapureddy venkataramireddy ఈ నవల రాయటంలో రెండు ఉద్దేశ్యాలున్నాయి. రాయలసీమ రైతు, రైతుకూలీల బతుకులు ఇప్పుడు వలస బతుకులయ్యాయని చెప్పటం ఒకటైతే రెండవ విషయం ఏమిటంటే ఎన్ని కష్టాలు వెంటాడుతూ వున్నా ఏడుస్తూ కూచోవటం ఇక్కడి మనుషుల లక్షణం కాదు. ఎంత ఆకలేసినా చేతులు చాచి అడుక్కోవటం ఇక్కడి రైతులకు అలవాటు లేదు. నిరంతరం బతికేందుకే పోరాడుతుంటారు. బండరాతి మీద అయినా సరే పిడికెడు అన్నం పుట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. చెతుర్లాడుకోవటంలో ఆకలిని మరుస్తారు. బూతు పదాలు కలిసిన మాటలతో హాస్య సంఘటనలు చెప్పుకొంటూ నవ్వుకొంటూ కష్టాలు మరవటానికి ప్రయత్నిస్తారు. సద్ది సెరవలో పుల్లనీళ్ళ మీద తేలే పచ్చిమిరపకాయ మీద కూడా జోకులేసుకుంటూ దుర్భరమైన ఆ తిండినే కడుపారా తిని పనికి పోగలరు. బీడీకట్టకు లెక్కలేనంత దరిద్రంలో వుండికూడా ఒకే బీడీని నలుగురు పంచుకు తాగుతూ తమ దరిద్రం మీద తామే జోకులేసుకోగలరు. ఇక్కడి రైతు కరువుకు అలవాటు పడ్డాడు ఆకలికి లాగే నాయకుల వాగ్ధానాలకు అలవాటు పడ్డాడు - వట్టి మేఘాల ఉరుములకు లాగే. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ # చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004