OLIKIPOYINA VENNELA by MADABHUSHI DIVAKARBABU Telugu book cover

OLIKIPOYINA VENNELA

by MADABHUSHI DIVAKARBABU

₹200
In stock · 24 available
PublisherMADABHUSHI DIVAKARBABU
LanguageTelugu
ముందు మాట "ఇలికిపోయిన వెన్నెల" నవల చదివి ముందుమాట రాయమని అని అడిగారు మాడభూషి దివాకర బాబు ఇంతకుముందెప్పుడూ ఇలా ముందుమాటలు కాయలేవన్నాను. అయితే ఇంకా మంచిది ఏ మాత్రం చెబున్నా రాయమని అడిగారు. సరేనన్నాను. చదివాను. కొందరు జీవితాన్ని ఎవరేమనుకుంటారో అన్నట్టు బతుకుతారు. కొందరు ఇలా బతకటం ఆచారం, సంప్రదాయం కనక అన్నట్టు బ్రతుకు కొందరు కట్టుబాట్లు, పెద్దలు చెప్పారు కనక ఎలా వున్నా ఇలా బ్రతకటం ఇప్పటి సరి అని బ్రతికేస్తారు... ఎక్కడో నూటికో, కోటికో ఒక్కరు.. నా జీవితం నా ఇష్టం కన్నవాళ్ళకి చుట్టూ వున్న వాళ్లకి నచ్చక పొతే వాళ్ళఖర్మ. నేను మాత్రం - నిమషంలో ఎలా అనిపిస్తే అలా బ్రతుకుతా.. అది నందనవనమైన సరే - నేను నాశనం అయినా సరే .. అని తెగేసి చెప్పి, తెగించి బ్రతుకుతారు. వాళ్ళే మనం చెప్పుకునే కథ అవుతారు- మనం భయపడే చరిత్ర అవుతారు. అలాటి అమ్మాయి రాధారాణి కథ ఇది .. కాదు జీవితం. ప్రేమ కోసం తపించే ప్రవాహం లాటి ఆమె బ్రతుకులో ఎదురైన ప్రతిమనిషి ఏదో ఒక అనుభవాన్ని అందించారు 'ప్రేమ' తప్ప.... తొలిముద్దు సూర్యం, ఎదిగిన కూతురుకి ఎడంగా పడుకుని కోరికలు తీర్చుకునే కన్నవారు, భూషి