OM NAMO LAKSHMINARASIMHAYA by MOORAM REDDY LAKSHMI REDDY Telugu book cover

OM NAMO LAKSHMINARASIMHAYA

by MOORAM REDDY LAKSHMI REDDY

₹40
In stock · 1 available
PublisherMOORAM REDDY LAKSHMI REDDY
LanguageTelugu
ఓం నమో లక్ష్మీనృసింహాయ అవతార ఆవిష్కరణ శ్రీమహావిష్ణువు స్థితికారకుడు. స్థితికారకమగు ధర్మమునకు గ్లాని సంభవించి నప్పుడు అనగా దుష్టుల (ధర్మవిదూరులు, ధర్మవినాశకులూయగు వారి) బారినుండి - శిష్ఠుల (ధర్మానుచరులు, ధర్మరక్షకులు యగు, దేవ, ముని, సాధు, భక్తజన గణంబుల) సంరక్షించుటకుగానూ, ఆయా యుగాలలో కాలానుగుణంగా, ఆయా సందర్భాలకనుగుణంగా శ్రీమహావిష్ణువు ఆయారూపాలన దాల్చి అవతరించెదయని సాక్షాత్తు స్వామి వారే పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ! ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥ యని శెలవిచ్చి యున్న విషయం మనందరికి తెలిసిందే! భక్తజనుల, దీనుల, శరణార్తులను దుష్టుల బారినుండి సంరక్షించుటకునై భగవానుడు తన విభూతిని ప్రసరింపచేసి వారి వారి భయమును, ఆర్తిని, దైన్యతను బాపుచుండును. ఒకవేళ తన విభూతి వారి వారి భయమును, ఆర్తిని, దైన్యతను వాపజాలకున్న యెడల అంశావతారాన్ని గానీ, పూర్ణావతారాన్ని గానీ దాల్చి రావడం జరుగుతుంది. బ్రహ్మపురాణము ననుసరించి జగద్వ్యాపకుడుగా నున్న శ్రీమన్నారాయణుడు తనను తాను నాలుగు మూర్తులుగా విభజించుకుంటాడు. మొదటిది నిర్గుణమూర్తి