OM SHANTHI OM SHANTHI by KOCHARLAKOTA VENKATA SUBBARAO Telugu book cover

OM SHANTHI OM SHANTHI

by KOCHARLAKOTA VENKATA SUBBARAO

₹125
In stock · 50 available
PublisherRAITHU NESTAM PUBLICATIONS
LanguageTelugu
ఓం శాంతి! ఓం శాంతి! నేను ఆ ద్వీపం చూడటం అదే ప్రథమం. నలువైపులా కలయజూశాను. ఎక్కడా జనసంచారం లేదు. ఇంత ఎత్తయిన భవనాలు, ఎన్నో ఇళ్ళు ఉన్నాయి కదా! మానవులు నివసించకుండా వుంటారా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో చెవులు చిల్లులు పడేట్టు సైరన్ మోగింది. ఇళ్లల్లో వాళ్లు బిలబిలమంటూ బయటకు వచ్చారు. అయితే ఇంతవరకు కర్ఫ్యూలో ఉందన్నమాట నగరం అనుకున్నాను. ఎవరో హడావిడిగా పరుగెడుతూంటే ఆపి అడిగాను- “కర్ఫ్యూ ఎందుకు పెట్టారు బాబూ!” అని. అతడు నావైపు అనుమానంగా చూశాడు. నేను విలేకర్ని అని గుర్తించాడేమో! “ఈ ద్వీపం తీరే ఇంతా. ఎప్పుడూ ఇలానే వుంటుంది. రోజుకి గంటో రెండు గంటలో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారు. మీరెవరో నగరానికి కొత్త అనుకుంటాను. త్వరగా మార్కెట్టుకు వెళ్లండి. రేషన్ అయిపోయిందంటే బ్రతకడం కష్టం” అంటూ పరుగున వెళ్లిపోయాడు. నేను మళ్లీ ప్రశ్నలు అడుగుతానేమోనని భయపడినట్టున్నాడు. Meetటించడం నాకూ మంచిదనిపించింది. కొన్నాళ్లపాటు నేనూ ఆ ద్వీపంలో బ్రతకాలిగా! ఎందుకైనా మంచిదని మార్కెట్టుకు వెళ్లాను. coco అక్కడ మనుషులు చాలా వింతగా వున్నారు. ఆకారంలో ఎంత మాత్రం కాదు. వింతగా ప్రవర్తనలోనే. ఒకరిని మరొకరు అనుమానంగా చూస్తున్నారు. ఎవరూ ప్రక్కవాణ్ణి నమ్మడంలేదు. ప్రతివాడూ ఎదుటివాణ్ణి అనుమానంగా చూస్తున్నాడు. నిశ్శబ్దమైన వాతావరణంలోనూ అంతులేని భయం. అందరూ క్యూ పద్ధతిని పాటిస్తూ నిలబడి వున్నారు. ఎవరూ అదుపు చేయకపోయినప్పటికీ క్యూ నియమం పాటించడం నాకు ముచ్చట గొలిపింది. క్రమశిక్షణంటే ఇలా వుండాలని మనసులోనే '