
OMKARA TATVAM
by THOTAPALLI BALAKRISHNA SARMA
₹180
In stock · 8 available
PublisherTHOTAPALLI BALAKRISHNA SARMA
LanguageTelugu
శ్రీరస్తు ॐ శుభమస్తు ముందుమాట శ్లో॥ భువనాయకంవా ధననాయకంవా భజన్ భువంవా ధనమేతి లోకే । తద్విఘ్ననాథం నభజామి కింతు సహస్ర శక్తం ప్రణమామినిత్యం ॥ శ్లో॥ అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావన మచింత్య వైభవం | తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మెహే కిమపి తుందిలం మహః శ్లో॥ ఓంకార శృతి రూపయా కమలజం పుష్ణాతి యా నిర్మితౌ, -విష్ణోశ్చాపి దశవతార సుకృతిం వ్యాపారయన్తి శ్రియా ! జ్వాలా ఫాలతయా భవం లయవిధా వుజ్జీవయన్తి శివైః సా శక్తిర్లలితా ప్రసీదతు మయి శ్రీభూతి సంథాయినీ ॥ భా॥ ఏ మహాదేవి ఓంకార నాదంతో, ఆ నాదంలో వ్యక్తమైన వేదరాశితో బ్రహ్మని సృష్టికార్యానికి ఆదుకుంటుందో, ఏజగజ్జనని లోక రక్షణకు విష్ణువుచేత అనేకావతారాలెత్తిస్తూ సృష్టి రక్షణ సంపదను హరికి కల్గిస్తుందో, ఏ త్రినేత్ర లయకర్మకై తానే శివుని ఫాలాక్షముగా మారి లయం చేస్తూ, అందులో శివుడు నష్టపోకుండా బ్రతికింప జేస్తుందో, అట్టి త్రిపురాథి దేవతయగు లలితాపరాభట్టారిక నాయందు శ్రీ విభూతి రచనా సంపదను ప్రసాదించుగాక. మన భరతభూమి కర్మభూమి. అట్టి కర్మభూమిలో నున్న భారతీయులకు వేదము మూలము. ఆ వేదములకు ఆధారము శబ్దం ప్రణవం. ఆ ప్రణవనాదమే ఓం కారం. ఆ ఓంకారోచ్చారణం పరలోక ప్రాప్తి స్థానం. త్రిమూర్త్యాత్మక రూపచిహ్నముగా, దైవీ సంపదగా, మంగళాచరణముగా, అవిఘ్నముగా తొలినుచ్చరించు ఓంకారమును పిల్లలకు విద్యాభ్యాసమునకు ముందు అక్షరాభ్యాసముగా నీ ఏకాక్షరమును పలుక, దిద్ద యత్నించుట మన సంస్కృతి. భగవాన్నమముకును ముందు ఓంకారము నుచ్చరించుటనునది ఆనామమునకు ఆహ్వానాక్షరముగా, మంగళప్రదముగా, ధ్వనింప జేయుట శ్రేయోదాయకం.