ONLINE LOVE KATHALU by DR.DARBA SATYANARAYANA MURTHY Telugu book cover

ONLINE LOVE KATHALU

by DR.DARBA SATYANARAYANA MURTHY

₹40
In stock · 190 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
“నీకు శారీరకంగా ఏ లోపమూ లేదు" అన్నాడు డాక్టర్ ప్రసాద్. అరగంట సేపు అన్నీ వివరంగా పరిశీలించి, పరీక్షించి అతను తేల్చినది అదీ. అయినా నాకెందుకో ఏదో బాధ... నాకే తెలియని బాధ.. అన్నీ అర్ధం చేసుకునే మిత్రుడని ప్రసాద్ దగ్గరకొస్తే చివరికి వాడుకూడా నాకేమీ లేదంటాడా!? ఎందుకు లేదు... రెండు నెలలనుండి ఆకలి లేదు.. నిద్ర లేదు.. ఏ పనీ చెయ్యలేకపోతున్నాను. అది ఏమిటి మరి? అదే అన్నాను. "నేను నిన్ను అర్థం చేసుకోగలను. కాని నేను చెప్పేది నిజం. నీకు శారీరకంగా ఏ లోపమూ లేదు. నీకున్న రోగమల్లా మనసులోనే..” అన్నాడు ప్రసాద్. "మనసులోనా?" - చిరాకొచ్చింది. ఈ డాక్టర్లెప్పుడూ ఇంతే. ఏం అన్నాగాని మనసు - మనసు అంటూ ఉంటారు. అది ఉండడం వల్ల అన్నీ నష్టాలే కదా! “అవును. మనసులోనే” అన్నాడు మళ్లీ. కమ్మింది. "ఏం చేయాలి దానికి?"... ఎందుకో గతం గుర్తొచ్చి కళ్లమీద నీటిపొర "నేను చెప్పింది సీరియస్ గా చేస్తావా?” “చేస్తాను చెప్పు" అన్నాను. "సరే. అయితే విను. రేపు ఒక్క రోజు ఆఫీసుకు సెలవు పెట్టెయ్యి...” "అలాగే... సెలవు పెట్టేసి-" "సెలవు పెట్టేసి, నీకు బాగా ఇష్టమయిన చోటుకి వెళ్లు, అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకూ నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు... అలాంటి చోటు. అక్కడ నువ్వు ఎలాంటి సంకోచాలు లేకుండా చిన్నపిల్లాడిలా ఆనందంగా గడపగలగాలి. అలాంటి చోటు.. అక్కడికి నువ్వొక్కడివే వెళ్లాలి" “వెళ్లి, ఏంచేయాలక్కడ", కొంచెం అనుమానం, కొంచెం నవ్వు