
ONTARI NAKSHATRAM
₹45
In stock · 314 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అమ్మ” "సుజా! ఏడవకు!" అన్నాడు రవి! "ఆ దేవుడు మనకింత అన్యాయం చేశాక, ఏడవకుండా ఎలా ఉండమంటారు?" ఏడ్చి ఎర్రబడిన కళ్లతో భర్త వంక చూస్తూ అంది సుజాత, హాస్పటల్లో బెడ్ మీద పడుకుని! "సుజా! అసలే నీ ఆరోగ్యం బాగో లేదు! ఇలా ఏడుస్తుంటే నీ ఆరోగ్యం ఇంకా దిగజారుతుంది? కొంచెం దుఃఖాన్ని దిగమింగుకోవాలి!" “నా వల్ల కావడం లేదండి!” అంటూ అతని ఒళ్లో తల పెట్టుకుని హిస్టీరిక్గా ఏడ్చేసింది. "సుజా! ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి నిర్ణయమే. మన చేతుల్లో ఏముంది చెప్పు?" గద్గదికంగా అన్నాడు. ໖." "ఏవండీ, మనకిక పిల్లలు పుట్టరని తెలిసాక నాకింక బతకాలనిపించడం "సుజా! అలా మాట్లాడకు, ప్లీజ్ కంట్రోల్ చేసుకో! మనకి పిల్లలు పుట్టకపోతేనేం నాకు నువ్వు, నీకు నేను, మనమే ఒకళ్లకొకళ్లం తోడు సరేనా! అయినా నువ్వు ఇలా బాధపడుతూ, ఏడుస్తూంటే నేనేమైపోవాలి చెప్పు!” అతని మాటలకి చివ్వున తలెత్తి చూసింది సుజాత. అతని ముఖం అలసటగా పీక్కుపోయినట్టుగా ఉంది. “ఎంతసేపు మీ గురించే ఏమి ఆలోచించకుండా నా బాధే చెప్పుకుంటూ మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను కదూ!” "అదేం లేదు. కాని నువ్వు ధైర్యంగా ఉండు, నాకంతే చాలు!" ఆమెను దగ్గరగా తీసుకుని తల మీద చేయి వేసి జుట్టు నిమురుతూ అన్నాడతను. సుజాత ఏడుపు ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అతని మె చుట్టు చేయి వేసి అలాగే కరుచుకుపోయింది! సుజాతకి గర్భసంచి తీసేయడం, తనకిక పిల్లలు పుట్టరన్న వాస్తవ కళ్ల ముందు మెదలడంతో అతనికీ దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంలో ఎందుకో అతనికి తన తల్లి గుర్తుకు వచ్చింది. ఒంటరి నక్షత్రం (కథలు)