ONTARI NAKSHATRAM KATHALU by SUSEELA RAYAPROLU Telugu book cover

ONTARI NAKSHATRAM KATHALU

by SUSEELA RAYAPROLU

₹150
In stock · 11 available
PublisherSUSEELA RAYAPROLU
LanguageTelugu
ఒంటరి నక్షత్రం పేరుతో ఉన్న పది కథలు మానవ సంబంధాలకు ప్రతీకలు. సాహిత్యం, నృత్యం, సాంస్కృతిక రంగాలలో అనుభవం ఉన్న సృజనశీలి సుశీల రాయప్రోలు. రచయిత్రి జన్మించినది అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో. ఆ తర్వాత తాడిపత్రిలో వీరి కుటుంబం స్థిరపడింది. తల్లిదండ్రులు విశాలాక్షమ్మ, రాయప్రోలు నాగభూషణ శాస్త్రి. వృత్తి రీత్యా తండ్రి ఉపాధ్యాయుడు అయినందున సాహిత్య రంగంలో రచయిత్రి రాణించారు. ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠవాలలో హెచ్ఎస్ఎల్సీ దాకా చదువుకున్నారు. తర్వాత చిన్న వయసులోనే సంగీతం, నృత్యం, సాహిత్య రంగాలపై మక్కువను పెంచుకుని విశేషంగా సాధన చేశారు. కూచిపూడి, భరతనాట్యం శిక్షకురాలిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. భర్త గోళ్లపల్లి లక్ష్మీకాంతారావు గొప్ప వ్యాపార వేత్తగా పేరు గడించారు. వందలాదిమంది శిష్యులను నృత్యరంగంలో తయారు చేశారు. రాయప్రోలు రచయిత్రి పుట్టింటి పేరు. గోళ్లపల్లి ఆమె మెట్టినింటి పేరు. తన పూర్వీకుల ఆశీర్వాద బలం వల్లే తాను ఈ కథలు రాశానని, తన గొప్పదనం ఇందులో ఏవీ లేదని వినమ్రంగా చెబుతారు.. సుశీల. నిజాం ప్రభువు వద్ద ఆస్థాన పండితులుగా ఉండి ఐదుతరాల కిందట రజాకారుల ఉద్యమ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు వీరి పండిత కుటుంబం వలస వచ్చింది. - వెన్నెల పబ్లికేషన్స్