ONTARI PORU by S.VIVEKANANDA Telugu book cover

ONTARI PORU

by S.VIVEKANANDA

₹50
In stock · 4 available
PublisherS.VIVEKANANDA
LanguageTelugu
ఒంటరి పోరు! వ్యాపారంలో నిజాయితీపరులుండటం అసాధ్యమేకాదు అసంభవం కూడా అనుకునేవారి ఆలోచనని తలకిందులు చేసినవాడు సుబ్బారావు. బీటల్ నట్ పౌడర్ బిజినెస్ ని ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్ళిన సాహసి! ప్రభుత్వానికి చెందాల్సిన సేల్స్ టాక్స్... ఇన్కమ్ టాక్స్- లాంటివి ఏఏటికా ఏడాది కంచనుగా చెల్లించే అలవాటు... దొంగ లెక్కలుగానీ... దొంగ వ్యాపారం కానీ చేయటానికి వ్యతిరేకి! 'రెగ్యులర్ అండ్ ప్రామ్టే పేయర్' అవార్డు గ్రహీత సుబ్బారావు. వక్కపొడి వ్యాపారాన్ని దశదిశల విస్తరించి కోట్ల టర్నోవర్కి చేరుకున్నాడు. కోట్లకి పడగెత్తినా సుబ్బారావు అతి సామాన్యంగా కనిపిస్తాడు. మనిషిలో గర్వం... అహంలాంటివి కన్పించవు. ఏ.సి. బంగళా... ఇంపోర్టెడ్ కార్లో తిరిగే తాహతు సంపాదించుకున్నాడు. పాతికేళ్ళక్రితం కటిక దరిద్రాన్ని అనుభవించాడు. రెండుపూటలా కడుపునిండా తిండికైనా నోచుకోని దౌర్భాగ్యాన్ని చవిచూశాడు. తల్లి... తండ్రి... అక్కచెల్లెళ్లు... అన్నదమ్ములు అంతా కలిసి వున్న పెద్ద ఫ్యామిలీ సుబ్బారావుది. పిల్లా పెద్ద అంతా కలిసి ఇరవైమంది సభ్యులున్న ఫ్యామిలీని