
ONTARI TAPASWI
₹200
In stock · 39 available
PublisherGANGIREDDY ASWATHAREDDY
LanguageTelugu
ONTARI TAPASVI | ఒకో కవిని చదవంగానే అతని కాలమూ తెలుస్తుంది. అతని కలమూ ఎవరివైపు ఉన్నదో కూడా తెలుస్తుంది. గంగిరెడ్డి అశ్వర్థరెడ్డి ప్రజాకవి అని అతని రాతలు ప్రతి పాద పాదాన నిరూపిస్తున్నాయి. అతనిలోని అలజడి అతన్ని ఒక కవిగా మన ముందుకి తెస్తున్నది. రాజీలేని రచయితగా అతని ఆందోళన ప్రతి కవితా నిరూపిస్తున్నది. కవిత్వ ఆవరణంలోకి ప్రవేశించాక ఎప్పుడు ఏ కవి ఓ గొప్ప కవితతో మన ముందుకి ప్రత్యక్షమవుతాడో ఖచ్చితంగా చెప్పలేము. కవిత్వకళ నేర్చుకున్నాక తపస్సు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అశ్వర్థరెడ్డి అక్షరయాత్ర చేస్తున్నాడు. సాహిత్యయాత్ర నిర్విరామంగా చేస్తున్నాడు. తన సాహిత్య ప్రయాణంలో సాటికవుల ఇగోని చూసి ఒక అనుకంపనతో తనకు తాను సర్దిచెప్పుకుంటున్నాడు. ఈ మనోవ్యధ అందరు కవులూ అనుభవించిన వైనాలు, వెతలు, కథలు, సందర్బాలు కొత్తకాదు. అందరికి తెల్సినదే. అయితే ఈ సందర్భాన్ని ఒక కవితతో ప్రకటించి ధిక్కారతను చాటడంలోనే అశ్వర్థరెడ్డి ప్రత్యేకత ఏమిటో బైటిలోకం అర్థం చేసుకుంటుంది. -సాగర్ శ్రీరామకవచం ఎన్నో స్థానీయ స్థలాలు, స్థానికంగా జరిగే సంఘటనలు ఈతని కవిత్వంలో వొదిగిపోయాయి. అశ్వర్థరెడ్డి ఊహ చాలా చిత్రంగా వుంటుంది. వర్షం పడింది, రోడ్లు మట్టిముద్దయ్యాయి, మేఘాలను తోసేసి సూర్యుడు ఆకాశంలో మెరిసాడు, సూర్యకిరణాలు రోడ్లమీద పడ్డాయి, రోడ్లమీద నిలిచిన నీళ్ళల్లో సూర్యకిరణాలు ప్రకాశిస్తున్నా... ఈ ఊహని అశ్వర్థరెడ్డి ఎట్లా చెప్పాడో చూడండి. మేఘాల మాటున వున్న సూర్యుడు మేఘాలు తొలిగి బయటకు రావడం బెయిల్పై జైలునుంచి బయటకు రావడంతో పోలుస్తాడు ఈ కవి. కొత్తదైన ఊహ ఇది. పరిశీలనావాంఛతో చూసినదానిని సాధ్యమైనంత వాస్తవికదృష్టిలో అక్షరాల్లోకి అనువదించడం ఈ కవి అనేక కవితల్లో చేశాడు. అశ్వర్థరెడ్డి ప్రకటిస్తున్నవన్నీ అభ్యాస కవితలు. ఇవి కవిత్వనిర్మాణ శిల్పరాహిత్యంగా అగుపించవచ్చు. అయితే ఇతనికీ కవిత్వనిర్మాణ చిత్తశుద్ది ఎక్కువగానే ఉంది, భాష వుంది. భావాన్ని తడిచేయగల ఆర్ధ్రత ఈ కవి గుండెలో మెండుగా వుంది. కవితని సాంద్రంగా చేయగల శక్తి వుంది. స్థానికీయతను కవిత్వంలో పొదగగల నేర్పు వుంది. - తూముచెర్ల రాజారాం