OOHALA VASANTHAM by KETHAVARAPU RAJYASRI Telugu book cover

OOHALA VASANTHAM

by KETHAVARAPU RAJYASRI

₹45
In stock · 7 available
PublisherKETHAVARAPU RAJYASRI
LanguageTelugu
నామాట నా మొదటి కవితా ప్రయత్నం “చిరు సవ్వడులు" ఇందులో నానీలతోబాటు కొన్ని కవితలను కూడా చేర్చడం జరిగింది. ఒక కవితా సంకలనం అచ్చులో చూచుకోవాలన్న ఆరాటంతో కవితలు, నానీలు కూడా "చిరు సవ్వడులు" పుస్తకంలో పొందు పరచిన చిరు ప్రయత్నమది. అయితే ఒకసారి రాయటం మొదలు పెట్టిన తరువాత నన్ను స్పందింప చేసిన ప్రతీ అంశానికీ ఒక కవితారూపం ఇవ్వడం జరిగింది. అదే నా రెండవ ప్రయత్నం. "గుండె చప్పుళ్ళు" అనే నానీల సంకలనం. దీనిలో అన్నీ కూడా 'నా' 'నీ' అనే బేధం లేకుండా వృత్తి, ప్రవృత్తి కలగలిపి పలకరించిన భావస్ఫోరక నానీలు. నానీలలో 20-25 అక్షరాలలోపు భావాన్ని కుదించడం జరుగుతుంది. నా లోని గుండె చప్పుళ్లని ఇంకొంచం విస్తారంగా పలకరిద్దామని, ఈ కవితా సంకలనాన్ని వెలువరించాను. అన్ని కవితలూ ఒకే పుస్తకంలో వుంటే బాగుంటుందనిపించి “చిరుసవ్వడులు" లోని కవితలను కూడా ఇందులో చేర్చటం జరిగింది. తల్లీ, తండ్రీ, గురువు, దైవం అన్నారు. అందుకే మాతృమూర్తికి అక్షరాభిషేకం చేస్తూ, “అమృతత్వం" కవితతో ప్రారంభించి, తరువాత వరసలో నా తండ్రికి "అశృనివాళి" అర్పిస్తూ, నా 'గురువు' అని చెప్పుకోవడానికి అర్హత వుందో లేదోకానీ, ఆయన పాదాల కింద ఇసుక రేణువుగా తలుస్తూ "రమణ భగవాన్" మీద కవిత, నా ఇష్ట దైవం "సాయి బాబా” మీద అష్టకం రాయడం జరిగింది. తరువాత కవితలు సామాజిక పరమైనవి. "రమణ భగవాన్" కవిత రమణ మహర్షి ఆశ్రమానికి పంపడం, ఆశ్రమ నిర్వాహకులు, నాకవితను "భగవాన్" పాదాల చెంతవుంచి, పసుపు కుంకుమలద్ది, ప్రసాదముతోబాటు మరల నాకు పంపించి, హైదరాబాదులోని రమణ కేంద్రంవారు నిర్వహిస్తున్న "రమణ జ్యోతి"లో ప్రచురణకు పంపమని లెటర్ రాశారు.