
OOPIRI TALLIPALA RUNAM
₹170
In stock · 6 available
PublisherPOTTLAPALLI SRINIVASA RAO
LanguageTelugu
తల్లుల గర్భశోకంతో తల్లడిల్లుతున్న తెలంగాణ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మోయలేని భారాలు మీదపడ్డా, లక్ష్య బాటకు యింకా ఏదారీ కన్పించకున్నా, మిన్నులు విరిగి వెన్నుల మీద పడి కదలలేకుండా వున్నా మరెన్నెన్నో వైఫల్యాలు చుట్టూ ఆవరించి వున్నా ఆత్మబలిధానం మాత్రం చేసుకోవద్దు. ఆత్మబలిదానం అంటే ఒక్క నైరాశ్యం నుంచి వచ్చేది కాదు, అది కూడా త్యాగానికి దీపికే కాదనటంలేదు. కనిపించకుండా అదృశ్యమై కూడా అగ్గిరగిలించవచ్చునని యిప్పటివరకు తెలంగాణాలో సుమారు 700 మందిదాకా ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఎల్.బి.నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి వొంటికి అంటించుకున్న నిప్పు, ఉస్మానియా క్యాంపస్ ముందు సింగంలా దూకుకుంటూ నిప్పుల ఉప్పెనలా దూసుకొచ్చిన యాదన్న. పార్లమెంట్ సాక్షిగా యాదిరెడ్డి ఆత్మత్యాగం, చిదంబరం గందరగోళ ప్రకటనవల్ల శ్రీకాంత్ బలిదానం తెలంగాణా ఆంకాక్షల ప్రతిరూపం. ఈ ఆత్మబలిదానాల సాక్షిగా పార్లమెంట్ కదిలిపోయింది. బిజెపీ నేత సుష్మాస్వరాజ్ యాదిరెడ్డి ఆత్మబలిదానం సమయంలో రాసిన సూసైడ్ లేఖను చదివి దేశవ్యాపితంగా తెలంగాణా ఆకాంక్షను చాటిచెప్పింది. పార్లమెంటు ఒక్కసారిగా ఉత్కంఠకు గురైంది. ఆత్మహత్యలు చేసుకోవద్దూ తెలంగాణా కోసం ఉద్యమించండని ఆమె పిలుపునిచ్చింది.. ఆత్మబలిదానానికి పాల్పడే ప్రతివ్యక్తి ఇదే తన ఆఖరి బలిదానం కావాలని ఉత్తరం రాస్తూ బలిదానం చేసుకుంటున్నారు.