
OORIKI UPAKARI - GUTHIKONDA RAMABRAHMAM JEEVITHAM KRUSHI
₹40
In stock · 2 available
PublisherGUTHIKONDA RAMABRAHMAM
LanguageTelugu
ఎందుకీ గ్రంథం గ్రామాలు బాగుపడితేగాని దేశం బాగుపడదు అని గాంధీజీ ఏనాడో చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక గ్రామాల అభివృద్ధికి పలు పథకాలు వెలిశాయి. ప్రయత్నాలు జరిగాయి. గ్రామాలపై తగినంత కేంద్రీకరణ, వనరుల సమీకరణ తగినంతగా లేకపోవడం చేత ఇప్పటికీ అవి వెలవెలబోతున్నాయి. కనీస వసతులులేక, అభివృద్ధికి దూరంగా దుర్భర పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ తరుణంలో ఒక సామాన్య రైతు సేవాదీక్షతో నడుం బిగించి మోపర్రు గ్రామాన్ని బహురీతుల అభివృద్ధి చేశారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బడుగు వర్ణాలకు పలు సౌకర్యాలు కల్పించారు. అందరికీ ఉపయోగించే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదంతా ఒక వ్యక్తి పూనుకొన్నందున జరిగిన సత్కార్యాలే. ఈ పనులన్నీ పలు గ్రామాలకు ఆదర్శప్రాయం. కనుక మంచి పనికి తగు ప్రచారం ఇవ్వాలనే సదుద్దేశంతో, సాటి గ్రామాలకు ప్రేరణ కలిగించాలనే ఉద్దేశంతో, యువతరంలో తమ గ్రామం ఎడల శ్రద్ధాసక్తులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. గుత్తికొండ రామబ్రహ్మంగారు సామాన్యమైన రైతు. కాని ఒక్కరుగా ముందుకు వచ్చి అసామాన్యులయ్యారు. ఏ గ్రామంలోనయినా ఒక్కరు ముందుకు వస్తే చాలు మిగతావారు ఆ ఒక్కరికీ సహకరిస్తారు. అందుకు రామబ్రహ్మంగారి కృషి ఒక ఉదాహరణ. ఆ ఒక్కరి కోసం చేసే ప్రయత్నానికి ప్రేరణే ఈ గ్రంథం. ఈ గ్రంథ ప్రచురణకు ఎంతో విలువైన సమాచారాన్ని, ఎంతో శ్రమతో రూపొందించి తమ వంశ వృక్షాలను అందించిన డాక్టర్ రవీంద్రనాథ్ గారికీ, వారి సోదరి శ్రీమతి భారతిగారికీ, ఎందరో మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.