
OORU MARINDI
₹150
In stock · 32 available
PublisherBODAPATI RAMESH
LanguageTelugu
బోడపాటి రమేష్ తెలుగు పాఠకులకు పరిచయమైన పేరే. సుమారు ఐదు దశాబ్దాలుగా కథలు రాస్తూ. దాదాపు అన్ని పత్రికలలోనూ తన కథలను ఒలకబోసిన కథకుడు. ఈయన తండ్రి హరికిషన్ కూడా మంచి నవలా రచయిత. వారసత్వాన్ని. కేవలం వరసత్వంలా స్వీకరించ కుండా, దానికి తగ్గ కృషిని జత చేస్తున్నారు. ఈయన కథలు మనకేమీ నిరాశనో, దుఃఖాన్నో, భారాన్నో ఇవ్వవు. అలా అని నేల విడిచి సాము చేయవు. పంతొమ్మిది వందల డెబ్బయిల నుండి తెలుగు వాకిళ్లను, వాటిని ఆనుకుని మొలచిన ఇళ్లను, ఆ ఇంటిలోని సంఘటనలను, వాటికి కారకులైన మనుషులను రికార్డ్ చేసిన కథలివి. ఎగువ మధ్యతరగతి కుటుంబాల లోని సంబంధాలను కొంత వ్యంగ్యం గాను, కొంత వాస్తవం గాను, కొంత మధురం గానుచిత్రించిన కథకుడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరసాన్ని, సమరాన్ని సమ పాళ్లలో చెప్పడం యీయనకే చెల్లింది. తనకు తెలిసిన కాన్వాస్లోనే వెళ్ళడం, తన బతుకు నేర్పిన గీతలలో కథలను చెక్కడం యీయన ప్రత్యేకత బోడపాటి రమేష్ కథలు చదివిన పాఠకులు తెలుగుదనాన్ని ఐడెంటిఫై అవుతారు. ఆ కథలలోని సంగతులను గుర్తిస్తారు, గమనిస్తారు, గట్టిగా వాటిని తమ గుండెలకు హత్తుకుంటారు. ఈ కథలు మనకో స్వాంతనని ఇస్తాయి. ఈనాటి దైనందిన వేగానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న మనకు కాస్త విశ్రాంతి నిచ్చే మజిలీ అవుతాయి. అన్నింటికీ మించి మనలో మళ్లీ తేమను పుట్టిస్తాయి. చదవండి. మీకే తెలుస్తుంది..