OORVASI - NRUTYA NATIKA by VARANASI NAGALAKSHMI Telugu book cover

OORVASI - NRUTYA NATIKA

by VARANASI NAGALAKSHMI

₹25
In stock · 44 available
PublisherVARANASI NAGALAKSHMI
LanguageTelugu
ముందుగా ఒక మాట నా మొదటి పుస్తకం, 'వానచినుకులు' లలితగీతమాలిక వెలువడిన కొత్తల్లో ఒక రోజు ప్రసిద్ధ రచయిత్రి భార్గవీ రావుగారు మా ఇంటికి వచ్చారు. 'వాన చినుకులు' పుస్తకానికి ముందుమాట అందించి, వాత్సల్యం కురిపించి, అడగక ముందే తన సహకారమందించి, పుస్తకావిష్కరణ ఉత్సవాన్ని జయప్రదం చేసిన ఆమె ఆ రోజు నాకొక పని పురమాయించారు. 'నీ పాటల పుస్తకంలో చక్కని భావాలు, వాటికి తగిన పదజాలం చూసి నీ చేత ఒక నృత్యరూపకం రాయించాలని అనుకున్నానోయ్' అని ప్రకటించి, ఊర్వశీ పురూరవుల ప్రేమకథని ఇతివృత్తంగా ఎంపిక చేశారు. 'నృత్యరూపకమా? నేనా?' అంటూ తల అడ్డంగా ఊపుతున్న నన్ను కోప్పడి ఆ పనికి ఒప్పించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె అమెరికా వెళుతూ, నృత్యరూపకం ఎలా రాయాలో సూచనలిచ్చి, చలంగారు రచించిన 'పురూరవ' నాటిక పుస్తకాన్ని ఇచ్చి తను తిరిగి వచ్చేసరికి రూపకం తయారుగా ఉండాలని తర్జని చూపించి వెళ్లారు. తలా తోకా అర్థం కాని నేను 'పురూరవ'ను ఆకాశవాణివారు శ్రవ్యనాటికగా రూపొందించినపుడు, అందులో ఊర్వశికి తన గాత్రమాధురితో ప్రాణం పోసిన, జగమెరిగిన 'వాచికాభినేత్రి' శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారింటికి పరుగు తీశాను. శారదగారు ఆత్మీయంగా ఆహ్వానించి, ఎన్నో సంవత్సరాల క్రితం రేడియోలో ప్రసారమైన 'పురూరవ' శ్రవ్య నాటిక కాసెట్ని ఇచ్చి, నా ఈ రచనకి శ్రీకారం చుట్టించారు. ఇంటికి తిరిగి రాగానే పురూరవ చదివి, శారదగారిచ్చిన క్యాసెట్ విన్నాను. శ్రవ్యనాటిక ద్వారా ఒక రచనకు అంతగా ప్రాణం పోయవచ్చని ఎవరైనా చెపితే నేను నమ్మలేకపోదును. ఆ నాటిక వింటుంటే ఊర్వశి కళ్ళముందు సాక్షాత్కరించిందంటే అతిశయోక్తి కాదు.