OOSULADE OKA JABILATA by NISHIGANDHA Telugu book cover

OOSULADE OKA JABILATA

by NISHIGANDHA

₹125
In stock · 23 available
PublisherVIGNANA PRACHURANALU
LanguageTelugu
Oosulade Oka Jabilata - by Nishigandha పేరు : నిషిగంధ (యలమంచి కిరణ్మయి) పుట్టింది, పెరిగింది: విజయవాడ. ప్రస్తుత నివాసం: మయామి, అమెరికా జీవితం ఇపుడున్నంత ఘోరంగా, క్రూరంగా లేని కాలంలో ఒక గ్రామీణ ప్రాంత అమ్మాయి తన చుట్టూ ఉన్న సామాజిక వాస్తవికతను అర్థం చేసుకుంటూ తాను నమ్మిన ఆదర్శం వైపు ఎదిగే క్రమంలో ఆమెలోని భావ ఘర్షణను అత్యంత ప్రతిభావంతంగా.....వచనీకరించిన రచన ఇది. ఒకానొక కాలంలో సంభవించి కలల్లో కరిగి, ఊహల్లో మిగిలిన భౌతిక వాస్తవానికి fictional (కాల్పనిక) రూపం ఈ నవల. తెలుగులో దాదాపు మరణించిన epistolary novel అనబడే లేఖా సాహిత్యానికి పునర్జన్మ ఈ రచన. లేఖల రూపంలో కార్తీక పాత్ర తాలూకు వ్యక్తిత్వాన్ని బహుముఖంగా ఆవిష్కరిస్తూ ఆ చైతన్యాన్ని పాఠకుల మస్తిష్కంలో దేదీప్యమానంగా వెలిగిస్తుంది. అంతే కాదు, ఆ పాత్ర యొక్క గుణాత్మక, ఆశావహ వికాసాన్ని పాఠకుల కళ్ళకు కట్టిస్తుంది కూడా..... భావుకత మరణించి గ్లోబలైజ్ చితి మీద తగలబడేందుకు సిద్ధంగా ఉన్న తెలుగు సమాజపు సాహితీ శవ హృదిలో ఊపిరులేవో ఊదే ప్రయత్నం కూడా చేసిందీ రచన... అయితే మీరు చేయాల్సింది కేవలం మొదటి రెండు పేజీలు చదవడం మాత్రమే. ఆ తర్వాత సుళ్ళు తిరిగే నిషిగంధ పద వాక్య విన్యాస ప్రవాహంలో పడి కార్తీక మనోభావ సముద్రంలో శరవేగంగా సంగమించి సంలీనమై మీరే విలీనమవుతారు. అటువంటి అనిర్వచనీయ మహత్ పరిమళమేదో యీ నవలా విలక్షణ వచనంలో గుబాళిస్తుంది. వుండుండీ.....ఇందుకు సమాంతరంగా...మన జ్ఞాపకాలనూ! అనుభవించి..... పలవరించండి.