ORUGALLU KATHALU by DR.V.VEERACHARI Telugu book cover

ORUGALLU KATHALU

by DR.V.VEERACHARI

₹150
In stock · 1 available
PublisherDR.V.VEERACHARI
LanguageTelugu
వందేళ్ల తెలుగు కథానిక సాగరంలో వరంగల్లు** డా॥ వి. వీరాచారి అధ్యక్షులు, అరసం, వరంగల్ జిల్లా ఏ సాహిత్య చరిత్ర రచనైనా పరిపూర్ణత్వాన్ని పొందాలంటే ప్రాదేశికమైన అధ్యయనాలు, విశ్లేషణలు, నిరంతరంగా సాగాలి. ఒక ప్రాంత సాహిత్య చరిత్ర రచనకు ప్రాదేశికమైన సాహిత్య విమర్శలు ముడిసరుకు లాంటివి. కాబట్టి దురభిమానానికి తావునివ్వకుండా సహృదయంతో నిష్పాక్షికంగా ప్రాదేశికమైన సాహిత్య సమాలోచన జరిగితే ఆ దేశ లేదా జాతి సంస్కృతి నాగరికతలను అంచనా వేయటం సులభతరం అవుతుంది. తెలుగునాట ఈ మధ్యకాలంలో ఈ విధమైన అధ్యయనాలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేదగిరి కమ్యూనికేషన్ నిర్వాహకులు డా॥ వేదగిరి రాంబాబుగారు జిల్లాల వారిగా కథానిక సదస్సులను నిర్వహిస్తూ, ఆయా జిల్లాల కథానికల తీరుతెన్నులపై స్థానిక విమర్శకులచేత వ్యాసాలు రాయించి, పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. కథానిక అంటే డా॥ వేదగిరి రాంబాబుగారికి ప్రాణం కాబట్టి ఉడతాభక్తిగా ఈ కృషి చేస్తున్నారు. అయితే ఆధునిక తెలుగు సాహిత్యం ప్రక్రియ వైవిధ్యంతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో కథానిక ఒక ప్రక్రియ మాత్రమే. ఇది పుట్టి ఫిబ్రవరి 2009 నాటికి వంద సంవత్సరాలు అవుతుంది. కథానిక ప్రేమికుడుగా డా॥ వేదగిరి రాంబాబు గారు "వంద సంవత్సరాల తెలుగు కథానిక" ఉత్సవ సమావేశానికి ముందు 2008 ఫిబ్రవరి నుండి 2009 ఫిబ్రవరి వరకు సంవత్సరం పొడుగునా జిల్లాల వారిగా కథానిక సదస్సులను స్థానిక సాహిత్య సంస్థల సహకారంతో నిర్వహించ తలపెట్టి ముందుకు సాగడం అభినందనీయం. ఆయన చేస్తున్న ఈ కృషిని సఫలీకృతం చేయడానికి "వందేళ్ల తెలుగు కథానిక సాగరంలో వరంగల్లు" వ్యాసం నా వంతు కర్తవ్యంగా రాస్తున్నాను. 2 తెలుగు సాహిత్య చరిత్రకారులు 1910లో విజయనగరంలో మొట్టమొదట తెలుగు ** కథానిక పుట్టిందంటారు. రచయిత గురజాడ. కథానిక పేరు 'దిద్దుబాటు'. కాకతాళీయమే