PAADA CHAKKANI SATHAKAMU by ILLA MURALIDHARA RAO Telugu book cover

PAADA CHAKKANI SATHAKAMU

by ILLA MURALIDHARA RAO

₹40
In stock · 200 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126627
PAADA CHAKKANI SATHAKAMU By Illa Muralidhara Rao పిల్లలలో మంచితనపు బీజాలు నాటేందుకు వీలుగా సరళంగా రాయబడి, పెద్దలను అప్రమత్తం చేస్తూ, జీవితం గూర్చి సూక్ష్మంగా చెప్పే ఈ పాడ చక్కని శతకంలోని పదప్రయోగం (మత్త) 'కోకిల'లా పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ శతకంలో ప్రతీ పద్యసారాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో కిందనివ్వడం జరిగింది. మనిషి మరిచిపోతున్న 'మనిషితనాన్ని' గుర్తు చేస్తుందీ శతకం. ఈ పుస్తకానికి తొలిపలుకు (అభినందన) రాసింది ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. వారి పేరుకు ముందు 'ఆచార్య' అని కూడా వెయ్యవద్దని చెప్పిన ఔన్నత్యం ఆయనది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఎన్నో బిరుదులు ఆయనను వలచి వరించాయి. అయినా అతి సామాన్యంగా ఉండడాన్ని ఇష్టపడే అసామాన్యులు ఆయన. అలాగే మలిపలుకు రాసిన విశిష్టవ్యక్తి ఈనాడు దినపత్రికలో 'అంతర్యామి’ శీర్షికలో దర్శనమిచ్చే ఘనులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. నిరాడంబరులైన వీరి గూర్చి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతటి మహామహుల దీవెనలకు నోచుకున్న ఈ శతకము ధన్యము. సామాజిక మాధ్యమాలకు పూర్తిగా అలవాటుపడిన యువత, సాహిత్యపఠనానికి ముందుకు రావాలి. కారణం సినిమాలో, సమాజమో తెలియదు గానీ నానాటికీ మానవత్వం కరువవుతోంది. సమాజం అంటే మనుషులే. అందులో నువ్వూ నేనూ మన కుటుంబసభ్యులూ భాగమే కదా. ఇతరులతో నువ్వెలా ప్రవర్తిస్తావో, ఇతరులూ నీపట్ల అలాగే ప్రతిస్పందిస్తారు. ఇంకెందుకాలస్యం? మంచితనాన్ని సరళమైన పద్యాలలో రంగరించి, పద్యాలకు భావం కూడా ఇవ్వబడిన ఈ శతకాన్ని చదవడం ప్రారంభించండి. ఇళ్ళ మురళీధరరావు ISBN: 978-93-48126-62-7 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004