
PADA CHITRAM
₹250
In stock · 67 available
PublisherSATISH CHANDAR
LanguageTelugu
నిర్వచన కవిత్వం కవిత్వం, వ్యంగ్యం, కథ, విమర్శ, నవల, నాటకం, నిఘంటు నిర్మాణం, సంపాదకీయం, పాత్రికేయ పాఠ్యపుస్తకరచనల ద్వారా తెలుగు వారికి సుపరిచితులు సతీష్ చందర్. ఏ ప్రక్రియ చేపట్టినా పాఠకాదరణ, విమర్శకుల ప్రశంసలతో పాటు, ఆ ప్రక్రియలోని ఉద్దండుల ఆమోదం పొంది వారి సరసన స్థానం సంపాదించారు. కవిత్వప్రక్రియలో ఆయన తొలి సంపుటి 'పంచమవేదం' దుమారం లేపింది. తెలుగునాట దళిత వాదానికి తెరతీసి, 90వ దశకమంతటా నడిచిన దళిత సాహిత్య విమర్శకు కేంద్ర బిందువయింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ(తెలుగు సాహిత్యం)లో పాఠ్యగ్రంథమయ్యింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఇతర విశ్వవిద్యాలయాలలో కూడా 'పంచమవేదం' కవితలు పాఠ్యాంశాలయ్యాయి. వీటి అనువాదాలను కేరళ విశ్వవిద్యాలయం ఎం.ఎ ( ఆంగ్ల సాహిత్యం)లో పాఠ్యభాగాలుగా స్వీకరించింది. గత శతాబ్దిలో వెలువడిన లక్షలాది గ్రంథాలనుంచి 'తానా' సంస్థ నూరు ఉత్తమ గ్రంథాలను ఎంపిక చేస్తే అందులో 'పంచమవేదం' స్థానం పొందింది. తెలుగుతో పాటు కన్నడంలో పునర్ముద్రణకు నోచుకుంది. రచయితకు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఇంత వరకూ సతీష్ చందర్ 19 గ్రంథాలను వెలువరించారు. కవిత్వానికి సంబంధించి, 'పంచమవేదం' తర్వాత 'నాన్న సైకిలు' దీర్ఘకవిత, 'పసుపు జాబిల్లి', 'ఆదిపర్వం' కవిత్వసంకలనాలు ప్రచురితమయ్యాయి. 'పదచిత్రం' 20వ గ్రంథం. వ్యంగ్యంలో తొలిగ్రంథమయిన 'మేడిన్ ఇండియా'తోనే ఆయన ప్రసిధ్ధులయ్యారు. 'మనకో బుచ్ వాల్డ్ దొరికాడు' అని ఎబికె ప్రసాద్ 1989లోనే