PADAHARU ANAALA NIJAM by REEM PUBLICATIONS Telugu book cover

PADAHARU ANAALA NIJAM

by REEM PUBLICATIONS

₹194
In stock · 3 available
PublisherREEM PUBLICATIONS
LanguageTelugu
ISBN9789387808423
పదహారుఅణాల నిజం కథాసంపుటి నిజం చెప్పాలంటే మూల రచన కన్నా అనువాద రచన చేయటం క్లిష్టతరమైన పని. మూల రచయిత తాలూకు సృజనావిహంగాలకు అవధులు లేవు. కానీ అనువాద కుడు స్థితి అది కాదు. మూల రచనలోని ఏ భావమూ జారిపోకుండా, కొత్తవేవీ అపా దించకుండా మూల రచన తాలూకు శైలీ అందులో కనబడే సమాజం తాలూకు సంస్కృతిక అంశాలు వగైరాలు జారిపోకుండా లక్ష్యభాషలోకి తీసుకురావడమనేది కష్టతరమైన పని. ముఖ్యంగా లక్ష్యభాషలో అనువాదం చేయబడిన రచన 'విదేశీ సరుకు' అని అనిపించు కోకుండా ఉండాలి. రెండు భాషలపట్ల, మూల లక్ష్య భాషల సామాజిక జీవితం పట్ల ఎంతో పట్టు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. చాలా సరళమైన భాషలో చక్కని తెలుగులో చదివించేలా సాగింది నిర్మలగారి అనువాదం. కొన్ని చోట్ల సందర్భానుగుణంగా తెలుగు సామెతలను చేర్చడం అనువాదానికి అందమిచ్చింది. 'చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు' ఇలాంటి మాటలు కథలలో 'నేటివిటీ' తీసుకురావడానికి తోడ్పడింది. విశాఖపట్టణం ఎల్.ఆర్.స్వామి ద్విభాషా రచయిత, కథకులు, అనువాదకులు కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత