PADAMATI GODAVARI RAGAM KATHA SAMPUTI by SRINIVASARAJU INDUKURI Telugu book cover

PADAMATI GODAVARI RAGAM KATHA SAMPUTI

by SRINIVASARAJU INDUKURI

₹100
In stock · 6 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
పసిడి తివాచీలు పరచినట్లుండే పంటపొలాలు.. పడుచువన్నెలతో ఒంపులు తిరిగిన కొబ్బరిచెట్లు... నోరూరించే ఆవకాయ రుచులు... కళ్ళాపి చల్లిన ముంగిళ్ళు... ముగ్గులతో నిండిన వాకిళ్ళు... ముసి ముసిగా నవ్వే లోగిళ్ళు... కలివిడిగా మసిలే మనసులు... కల్మషమెరుగని మనుషులు... నవ్వుపుట్టించే గోదారోళ్ళ భాషలోని యాసలు... ఎటకారాలు.. మమకారాలు.. అన్యోన్యతలు.. అతిగా అనిపించే మర్యాదలు.. అతిధి సత్కారాలు.. ఇవి మా గోదారిజిల్లాల్లో ప్రత్యేకమేనండోయ్! "పడమటి గోదావరి రాగం" అని చదివి, ఇది ఒకే ప్రాంతానికో.., లేక ఒకే విషయానికి చెందినదని అనుకుంటే పొరబడ్డట్టే మరి! మిమ్మల్ని ఒకోసారి నవ్విస్తూ.. ఒకోసారి మనసుకు హత్తుకునేలా చేసి.. ఒకోసారి ఆలోచింపచేస్తూ.. అన్నీ కలగలిపిన మన తెలుగువారి విందు భోజనమే ఈ పుస్తకం. గోదారి గలగలతో.. పైరగాలి రెపరెపలతో.. మనసు పాడుకునే చక్కని పాటలాగా.. ఈ పుస్తకం మీ అందరి మదిలోతుల్లో దాగివున్న చిన్ననాటి జ్ఞాపకాలను బయటకు తీసి.. అలరిస్తుందని నా నమ్మకం. ప్రేమతో... మీ శ్రీనివాసరాజు ఇందుకూరి