
PADANDI MUNDUKU-100
₹100
In stock · 18 available
PublisherADIGOPULA VENKATARATNAM
LanguageTelugu
తులాభారం పెళ్ళి తులాభారమయ్యాక పెళ్ళికూతుళ్ళందరూ సత్యభామలే భూమిని ఖాళీ చేయించి అతడు భూగోళమంత పీట వేశాడు ఆకాశాన్ని దింపి ఇంటిముందు పందిరి వేసి సక్షత్రాలను కోసుకొచ్చి పందిట్లో అతికించాడు! తమలపాకంత మామిడాకుల్ని తోరణాలు కట్టి తామరాకంత తమలపాకుల్తో తాంబూలాలు తయారయ్యాయి మేఘాలు కొండలు నదులు గుడులు గోపురాల సెట్టింగుల శోభ చూడ్డానికి వొళ్ళంతా కళ్ళు చేసుకున్నా చూపులు అందుకోలేని అందాలు పెళ్ళిపిలుపు కార్డులా లేదు వెండి కవచంలా వుంది ఎన్ని వంపులో మరెన్ని అలంకారాలో పనివాళ్ళు గాల్లో నడుస్తున్నారు. గంటలో తేలాల్సిన పనులు నిముషాల్లో తెమల్తున్నాయి. ఖ్యాతి నార్జించిన నాదస్వరాలు పదండి ముందుకు