PADHYAANUBHAVAM by DR.G.V.PURNACHANDU Telugu book cover

PADHYAANUBHAVAM

by DR.G.V.PURNACHANDU

₹125
In stock · 3 available
PublisherTIRUMALA TIRUPATHI DEVASTHANAM
LanguageTelugu
అతిథి మర్యాదలు శ్వశురగృహనివాసః స్వర్గతుల్యోనరాణాం యది భవతి వివేకః పంచభిష్షడినైర్వా దధిమధుఘృతలోపో న్మాసమేకం నరాణాం తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగః (చాటువు) భారవి మహాకవి ఇల్లరికం వెళ్ళి అత్తగారింట్లో పొందిన భోజన అవమానాల కథ సాహిత్యంతో పరిచయం కలిగిన వారికి ఎరుకే! మామగారిల్లు స్వర్గలోక నివాసంతో సమానం. వివేకం కలిగి ఐదారు రోజులుంటే స్వర్గానికన్నా గొప్పగానే ఉంటుంది. ఆ తరువాత కూడా అల్లుడు అక్కడే కొనసాగితే భోజనం లోంచి క్రమంగా పెరుగు, తీపిపిండివంటలు, నెయ్యి ఇవన్నీ ఒక్కక్కటే అదృశ్యం అవుతాయి. అది గమనించి అల్లుడు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటే మంచిదే! సిగ్గువిడిచి ఒక నెలయ్యాక ఒక్క రోజు ఉన్న పాదరక్షల ప్రయోగం కూడా జరగవచ్చంటాడు. కవి ఈ చాటుపద్యంలో! అతిథి దేవో భవ' అనే సంస్కృతి మనది. అతిథికి వడ్డించి, ఆయన ముద్ద నోట్లో పెట్టుకున్నాకే గృహస్థు భోజనం ప్రారంభిస్తాడు. ఇది మన ఆహార సంస్కృతి. ఇందుకు విరుద్ధంగా ఇంగ్లండులో మొదట గృహస్థు ఆహారాన్ని నోట్లో పెట్టుకున్నాకే అతిథి తింటాడట. అది అక్కడి మర్యాద. ఈ మర్యాదలో ఆక్షేపించవలసింది కూడా ఏమీ లేదు. అది శబరి భక్తి లాంటిది. తాను కొరికి తియ్యగా ఉన్న పండునే రాముడికి పెట్టింది. ఇదికూడా 'అతిథి దేవో భవ' లాంటి మర్యాదే! భోజన మర్యాదలు మన సంస్కృతిని, సంస్కారాన్నీ తెలియచేస్తాయి. తిథి వార నక్షత్రాలు చూడకుండా అప్పటికప్పుడు ఊడిపడతాడు అతిథి. అతని స్థాయి ననుసరించి అతనికి చేసే మర్యాదల స్థాయి కూడా ఉంటుంది. మర్యాదల్లో ఖరీదైంది భోజనమే! భోజనం దగ్గరే అసలు మర్యాదలు బయట పడతాయి.