
PADILECHE KERATAM
by SALEEM
₹200
In stock · 31 available
PublisherSALEEM
LanguageTelugu
పడిలేచే కెరటం పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టిన సాగర్ హృదయ ఘోష ఈ నవల. అంగవైకల్యంతో పాటు పేదరికంతో కూడా పోరాడి గెలిచిన సాగర్ తనలోని అంతర్బహిర్ లోకాల్ని ఆవిష్కరిస్తూ, తన అంతరంగ కల్లోలాల్ని అక్షరబద్ధం చేస్తూ రాసుకున్న ఆత్మ కథే ‘పడిలేచే కెరటం'. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల్లో పోరాట పటిమనూ, స్పూర్తిని నింపే నవల ఇది. అంగవైకల్యంతో బాధపడేవాళ్ళతో సున్నితంగా వ్యవహరించాలని తెల్సినా కొంతమంది, తెలియకుండా చాలామంది వాళ్ళని మానసికంగా హింసపెడ్తుంటారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల విషయంలో మన సమాజంలో ఉన్నంత ఇన్సెన్సిటివ్గా మరే దేశంలోనూ ఉండరేమో. వాళ్ళని తమ చూపుల్తో, మాటల్తో, చేతల్తో గాయపరిచేవాళ్ళెందరో.. చదువులేని జులాయి మనుషులు మాత్రమే వాళ్ళని ఎగతాళి చేసి బాధపెడ్తారనుకోవడం అపోహ మాత్రమే. ఉన్నత విద్యావంతులు, ఉన్నత హోదాల్లో ఉన్నవాళ్ళు కూడా సంస్కారహీనంగా వాళ్ళని అవహేళన చేసి అవమానపరుస్తుంటారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల హృదయాల్లో వేదనా సముద్రాలు ఎగసిపడ్తుంటాయి. వాళ్ళ లోపల మనకెవ్వరికీ తెలియని మరో లోకం ఉంటుంది. అందులో ఎన్ని అగ్నిపర్వతాలో లావాని ఎగజిమ్ముతూ.. ఎన్ని సునామీలో పోటెత్తుతూ...ఎన్ని భూకంపాలో గుండెల్ని బద్దలు చేస్తూ.. వాళ్ళను చూసే మనుషులకు వాళ్ళ శారీరక వైకల్యం కన్పిస్తుంది తప్ప అనేకానేక గాయాల్తో రక్తమోడుతున్న హృదయ ఘోష విన్పించదు. తెలుగు సాహిత్యంలో అంగవైకల్యం ఉన్న వ్యక్తుల మానసిక సంక్షోభాల్ని ఆవిష్కరిస్తూ వచ్చిన అరుదైన నవల 'పడి లేచే కెరటం.' ఈ నవలని హృదయంతో చదవండి. వాళ్ళ హృదయఘోష విన్పిస్తుంది. మీకళ్ళకు కొందరి జీవితాల్లో మనుషులు అనాలోచితంగానో, అహంకారంతోనో చేసే గాయాలు కన్పిస్తాయి..