PADYAMLO MANAM by DR.G.V.PURNACAHND Telugu book cover

PADYAMLO MANAM

by DR.G.V.PURNACAHND

₹116
In stock · 16 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
అక్షర పూర్ణుడు పూర్ణచందు - డా|| ఎన్. గోపి పూర్వపు వైస్ చాన్సలర్, తెలుగు విశ్వవిద్యాలయం తెలుగులో పద్యం ఒక వాకిక మాత్రమే కాదు. గణబద్దమూ పాదబద్ధమూ అయిన పదాల కూర్పు మాత్రమే కాదు. అదొక సంస్కృతి. పైకి యాంత్రిక చట్రంలా కనిపించినా ఆ గీతల మధ్య ఒక మాంత్రిక లోకాన్నే సృష్టించ వచ్చు. సృష్టించారు. కూడా. ఆ లయలో, ఆ నడకలో పదాలకు వినూత్న సౌష్టవాన్నీ అర్థాలకు నవీన స్ఫూర్తినీ కలిగించవచ్చు. పుట్టడం పుట్టడమే తెలుగు సాహిత్యం పద్యంతో పుట్టింది. వదులుగా ఉన్న శాసన ఛందోబద్ధ రూపాలను అద్భుతంగా పరిష్కరించి భారతాన్ని ప్రారంభించాడు. నన్నయ! తన శైలీ మాహాత్మ్యంతో నగిషీలను ఏర్పరిచాడు. ద్రవ రూపంలో వున్న భాషకు తీరుపులు సంతరించాడు. ఎప్పటికైనా పద్యం అంటే తెలుగులో ఒక ప్రక్రియ మాత్రమే కాదు. కవిత్వానికి పర్యాయపదం. 'ఓ పద్దెన చెప్పు' అంటే కవిత్వం చెప్పమనే. పద్యం నుంచి పక్కకు జరిగి ప్రయోగాలు చేసినవారు. కూడా పద్యంలో పుట్టి పెరిగిన వారే, శ్రీశ్రీ తో సహా. అటువంటి పద్యానికి వ్యాఖ్యానప్రాయమైన ప్రకాశ వ్యాసంగం చేస్తున్నాడు. డా|| జి.వి. పూర్ణచందు. గత 110 వారాలుగా 'పద్యానుభవం' పేరుతో శీర్షిక నిర్వహిస్తున్నాడు. లోకంలో ప్రసిద్ధమైనవీ లేదా తనకు బాగా నచ్చినవి, వ్యాఖ్యాము సాపేక్షమైనవీ, జటిలమైనవీ పద్యాలను ఎన్నుకొని మనతో ముచ్చటిస్తున్నాడు. దా పూర్ణచందులాంటి వారికిది సాహసమే. ఈ సాహసాన్ని ఆయన అలవోకగా నిర్వహిస్తున్నాడు. సాహస మనడం ఎందుకంటే, ఆయన బహువ్యాపి, పైకి రెండు చేతులు కన్పిస్తున్నా వెయ్యి చేతులతో పని చేస్తున్నాడు. 9 వార, మాస పత్రిక వివిధ అంశాల పైన ఏక కాలంలో శీర్షికలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే శతాధిక. గ్రంథకర్త. బహుపార్శ్వీన శేముషీ గుణ సంపన్నుడు అనకుండా ఉండలేను. పద్యం అనేది ఒక వ్యాజం. దాని వంకతో ప్రపంచంలోని పలు అంశాలను ఆయన వెలిగిస్తూ పోయాడు. ప్రతి పద్య వ్యాఖ్యానానికీ ఒక వినిర్మాణాన్ని (ఫార్మెల్ ఏర్పరచుకున్నాడు. మొదట పద్యాన్ని ఒక ప్రవచన పద్ధతితో ఉన్మీభీకరము. కావించడం, అది ఏ కవిదో చెప్పి సందర్భోచితంగా వివరించడం, ఇక దాని పాదాలను పక్షాలుగా మార్చుకొని సాహిత్య వీధుల్లో విహరించడం.