PADYANIKI PRANATHULU by ILLA MURALIDHARA RAO Telugu book cover

PADYANIKI PRANATHULU

by ILLA MURALIDHARA RAO

₹80
In stock · 479 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789359063171
భాష బతకాలంటే సాహిత్యం బతకాలి. సాహిత్యం బతకాలంటే అన్ని ప్రక్రియల్లోనూ రచనలు రావాలి. ముఖ్యంగా తెలుగుకి సొంతమైన 'పద్యం' నిత్యనూతనంగా అలరారాలి. తేలికపాటి మాటలతో పద్యాలు రాయడం సులభమే. ఈ విషయాన్ని ప్రజాకవి వేమన గారేనాడో రుజువు చేశారు. పద్యమంటే కొందరు పాఠకుల్లోనూ, ఎందరో విద్యార్థుల్లోనూ ఉన్న భయాన్ని తగ్గించి, పద్య పఠనకు, పద్య రచనకు నేటి తరాలను ఉన్ముఖులను చేయాలనే సత్సంకల్పంతో పద్య కవులనూ, వారి రచనలనూ పైపైన స్పృశిస్తూ, పద్యాల వృత్తాలు, వాటి నియమాలను కూడా ఉటంకించటం జరిగింది. ఈ పుస్తకం చదివాక ఏ కొద్దిమంది పద్యరచనా వ్యాసంగంలో దిగినా నా జన్మ ధన్యమైనట్టే. ఇదే సమయంలో భాషావేత్తలు కత్తులు నూరకుండా, కాస్త మృదువుగా (మాబోటి) వారిని ప్రోత్సహించాలని ప్రార్ధన. భాషపై గల అభిమానంతోనే తొలిసారిగా కొన్ని దండకాలు, కాసిన్ని నానీలూ, మరిన్ని హైకూలు రాయడానికి సాహసించాను. నన్ను నేను సరిదిద్దుకోవడానికి విమర్శలను ఆహ్వానిస్తున్నాను. తెలుగు సాహిత్యాన్ని అందరూ చదవాలని, ఇంకెందరో రాయాలని బలంగా. కోరుకునే వారిలో నేనూ ఒకడ్ని. దయచేసి ప్రోత్సహించండి.