PALAPITTA PRAPANCHA JANAPADA KATHALU BOMMALATHO by A.N.JAGANNADHA SHARMA Telugu book cover

PALAPITTA PRAPANCHA JANAPADA KATHALU BOMMALATHO

by A.N.JAGANNADHA SHARMA

₹120
In stock · 400 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అయల సోమయాజుల నీలకంఠేశ్వర (ఎ.ఎన్) జగన్నాథశర్మ 13-4-1956లో జన్మించారు. ప్రవృత్తిరీత్యా రచయిత, వృత్తిరీత్యా పత్రికా రచయిత అయిన ఈయన సుమారుగా అయిదువందల కథలు, అయిదు నవలలు, అనేక వ్యాసాలు రాశారు. సినిమా, టీవి రచయితగా కూడా ప్రసిద్ధులు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ప్రచురణ 'నవ్యవీక్లీ' కి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. బాలసాహిత్యం అంటే వీరికి ఎనలేని మక్కువ. ఆ కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత జానపద కథలను అనుసృజనగా నేటి పాఠకులకు అందించారు. ఇప్పుడు మనం చదివే మహాగాథలన్నిటికీ ప్రారంభాలు ఈ కథలు. కల్పనను ప్రయోగించడానికి మానవుడు ఎంచుకున్న ప్రాచీన హరివిల్లులు. చెట్లకు, పుట్లకు కల్పన అవసరం లేదు. కానీ మనిషి శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో మనిషి మెదడుకు కల్పన అంతే అవసరం. జానపదుల సంతోష దుఃఖ విస్మయ అన్వేషణలు ఈ కథలు. అనుభవంలోంచి నేరుగా మనసుపెదాల్నించి జారిన శబ్దగాథలు. అందుకే ఇవి ఏ కాలంలోనైనా, ఏ మట్టిలోనైనా మొలకెత్తుతాయి. ఏ వయసుతోనైనా చెలిమిచేసి భుజం మీద చేతులేస్తాయి. ఈ పాలపిట్టలోకి అడుగు పెట్టడమంటే మనం మరచిపోయిన దేశంలోకి కొత్తగా అడుగు పెట్టడమే! కొత్త రుతువులకి రెపరెపలాడే కిటికీల్ని తెరవడమే! ఇప్పటికీ బాల్యాన్ని కాపాడుకుంటున్న జగన్నాథశర్మ ప్రతిభావంతమైన వేళ్ళలోంచి తెలుగు ప్రాణం పోసుకోవడం ఈ కథలకి అబ్బిన అదనపు అలంకారం. - రమణజీవి ఈ కథల్ని పెద్దలు చదివారంటే తమ బాల్యంలోకి వెళ్ళిపోతారు. అమ్మమ్మలూ, నానమ్మలు చెప్పిన జానపద కథల్లోని మాయాప్రపంచంలో విహరిస్తారు. ఈ పరుగుల ప్రపంచపు బాధలనుంచి కాస్త ఉపశమనం పొందుతారు. ఈ కథల్ని పిల్లలు చదివారంటే యువరాజులు, యువరాణులు అయిపోతారు. ఊహాలోకాల్లో విహరిస్తారు. మనుషుల్నే కాదు జంతువుల్నీ, పక్షుల్ని ప్రేమిస్తారు. మరో స్వర్గలోకపు ద్వారాలను తెరుస్తారు. నెలవంకకు వెన్నెల దారాలేసి తారాతోరణాలను ధరించి ప్రపంచం ఈ కొస నుంచి ఆ కొసకు కేరింతలు కొడుతూ ఊయలలూగుతారు. సుంకోజి దేవేంద్రాచారి ంటు