PALUKUBADI - 2 by DR.TIRUMALA RAMACHANDRA Telugu book cover

PALUKUBADI - 2

by DR.TIRUMALA RAMACHANDRA

₹100
In stock · 4 available
PublisherVETERAN JOURNALIST ASSOCIATION
LanguageTelugu
మున్నుడి తెలుగు భాషావికాస సంవత్సరంగా కొలువబడుతున్న 2013లో ముగ్గురు మహామనీషుల శతజయంతులు రావడం, తెలుగు భాషోన్నతికి వారు చేసిన మహత్తర కృషిని సదించుకునే ప్రత్యేక అవకాశాన్ని భాషాప్రియులకు కలిగించినది. ఆ మహనీయులు తిరుమల రామచంద్ర, పుట్టపర్తి నారాయణా చార్యులు, కాళోజీ నారాయణరావు. చివరి ఇద్దరు కవిత్వ ప్రక్రియలో సాటిలేనివారు. పుట్టపర్తివారు 'శివతాండవం' వంటి లయాత్మక పద్యకావ్యం రచించి అఖండ ఖ్యాతిని ఆర్జిస్తే, కాళోజీ ప్రజల గోడును తనగోడుగా అనితర సాధ్యమైన ఫణితిలో వదిన కవిత్వంగా అందించి ప్రజాకవిగా కీర్తి గడించారు. రామచంద్ర ప్రధానంగా పత్రికా వత గనుక వచనాన్నే కవిత్వమంత భావస్ఫోరకంగా, సర్వాంగ సుందరంగా అందించి వాసికెక్కారు. రామచంద్ర గొప్ప పండితుడు, బహుభాషావేత్త. నిర్విరామ పరిశోధకుడు. విమర్శకుడు, సాహిత్యసమీక్షకుడు, అనువాదకుడు, బహుగ్రంథకర్త. వీటన్నిటినీ పత్రికా రచనా వ్యాసంగాన్ని ఆలంబనగా చేసుకునే సాధించగలిగాడు. ఆయన పాత్రికేయ జీవనయానం 1944లో కాన్పూరులో 'డెయిలీ టెలిగ్రాఫ్' ఆంగ్లపత్రికతో ఆరంభమైంది. తర్వాత 'తెలంగాణ పత్రిక', ఆంధ్రపత్రిక', 'ఆంధ్రప్రభ' తానే స్థాపించి సంపాదకత్వం వహించిన 'పరిశోధన', 'ఆంధ్రభూమి' దినపత్రిక, 'హిందుస్తాన్ సమాచార్' వార్తా సంస్థలలో అర్థ శతాబ్దికి పైగా జయంగా సాగింది. పలుపత్రికలలో ఆయన విశేష పాఠకాదరణ పొందిన శీర్షికా రచయితగా కూడా నిజ నామంతో, కలంపేర్లతో గొప్ప భాషాసేవ చేశారు. రామచంద్రకు ఎన్నో పురస్కారాలు, చెరుదులు లభించాయి. కాని ఆయన 'పత్రకార్ శిరోమణి' బిరుదును మాత్రమే తమపేరు ముందు వ్రాసుకోడానికి ఇష్టపడేవారు. 'భాషా సేవకుడు' అనే తనను తాను వర్ణించుకొనేవారు. పత్రికారచనలో విషయపరిధి పెరిగిన కొద్దీ కొత్తపదజాలం అవసరమవుతుంది. శాస్త్ర, సాంకేతిక పరిభాష అవసరమవుతుంది. మనకు వైద్యం, శరీర నిర్మాణశాస్త్రం, రసాయనశాస్త్రం, జోహశాస్త్రం, గణితం, ఖగోళ విజ్ఞానంలో సంస్కృత గ్రంథాలలో కావలసినంత పరిభాష అందుబాటులో ఉంది. కాని లోపభూయిష్టమైన విద్యావిధానం వల్ల సంస్కృతం నేర్చుకునే అవకాశం లేదు. కనుక గ్రంథస్థం అయి ఉన్న భాషాసంపద కూడా పూర్వికులు భూగర్భంలో వాచిన ధనసంపత్తిలాగ వాడుకోలేని దుస్థితి. ఇడుముల రామచంద్ర