
PAMULA PUJARI - 50.00
₹50
In stock · 712 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మాట ఆ రోజు నరసింహకుమార్ పుట్టినరోజు అతని తండ్రి సురేంద్రకుమార్ అతనికి జన్మదిన సందర్భంగా నూరు రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. నరసింహకుమార్ గొప్పగా తల్లి పద్మని దగ్గరకు వెళ్లి, "అమ్మా! నాన్నగారు నాకు మారురూపాయలు ఇచ్చారు. ఇందులో ఇరవై ఐదు రూపాయలు పెట్టి నీకు ఏదైనా కొని ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటి కొని తెమ్మంటావు?" అన్నాడు. "కుమార్ నాకు కానుకలేమీ అక్కరలేదురా. కాని ఒక మాట ఇవ్వాలి నువ్వు ఈ రోజు అబద్ధం చెప్పకూడదు." అన్నది పద్మిని, "స్స్! ఇదేనా నీ కోరిక! అలాగే" అని బయటకు వెళ్లాడు కుమార్ దారిలో కుమార్ స్నేహితుడు బసవరాజు కనిపించాడు. "ఒరేయ్ కుమార్! ఈ రోజు నీ పుట్టినరోజు కదా. మీ నాన్న నీకేం ఇచ్చారు?" అనడిగాడు. తండ్రి డబ్బు ఇచ్చినట్లు చెపితే బసవరాజు అప్పు అడుగుతాడు. అతనికి అదో అలవాటు. పోనీలెమ్మని యిస్తే బాకీ తీర్చడు. నిజం చెప్పకపోతే అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనట్లు కదా! ఏమిటి చెయ్యడమా అని ఆలోచిస్తూ బసవరాజుకు తన చేతిలో వున్న సంచిలో నుండి ఒక లడ్డూని తీసి యిచ్చాడు. అందుకు బసవరాజు సంతోషించి తీపి తింటూ వెళ్లిపోయాడు. హమ్మయ్య! అని మనస్సులో అనుకున్న కుమార్ ముందుకు కదిలి కొంత దూరం వచ్చే సరి తండ్రి. కుమార్కు కొంత డబ్బు ఇచ్చి కొన్ని వస్తువులు ఇంటికి పట్టుకురమ్మని చెప్పాడు కుమార్ తండ్రి చెప్పిన వస్తువులు కొని ఇంటికి తెచ్చాడు.