PANIKOCHE MUKKA by RVR Telugu book cover

PANIKOCHE MUKKA

by RVR

₹100
In stock · 311 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సంబోధనల సాన్నిహిత్యం చైనాలో మళ్లీ 'కామ్రేడ్' అనే పిలుపులే వుండాలని 'పీపుల్స్ డైలీ’ ఉద్బోధించినట్టు వార్త. మార్కెట్ సరళి ఆర్థిక సంస్కరణలు వచ్చేక 'కామ్రేడ్' వెనక్కి తగ్గి మిస్టర్, మిజెస్ లాంటి సంబోధనలు వ్యాప్తిలోకి వచ్చాయి. అధికార హోదాలు వున్న సందర్భాల్లో 'డైరక్టర్' 'బాస్' లాంటి మన్ననలు వచ్చాయి. పార్టీ సభ్యులు కూడా తాము పనిచేసే చోట్ల అయ్యా, అమ్మా అంటూ వున్నారే కానీ పార్టీ సంబంధాలని సూచించే 'కామ్రేడ్' వాడడం లేదట. పార్టీ సమావేశాల్లో కూడా 'కామ్రేడే'తర పిలుపులే వినిపిస్తున్నాయట. అది మంచి పద్దతి కాదని, ఎంతో చారిత్రక, రాజకీయ నేపథ్యం వున్న 'కామ్రేడ్' పదాన్నే వాడాలందట ఆ పత్రిక. అసలు కామ్రేడ్ అంటే సన్నిహిత మిత్రుడు, సహవాసి అని అర్థాలు. కానీ ఎప్పుడు వాడకంలోకి వచ్చిందో తెలీదుగాని కమ్యూనిస్టు పార్టీ సభ్యులకి మాత్రమే వర్తించే పదంగా అది మారింది. కామ్రేడ్ అంటే కమ్యూనిస్టు అనే స్థిరపడింది. ఆ పదం వాడిన వ్యక్తి ఎర్రబావుటా నీడలోని వాడేనని మొహరు పడింది. చార్లీ చాప్లిన్ అంతటి వాడికి ఈ పద ప్రయోగం వల్ల గండం తప్పలేదు. రెండవ ప్రపంచ యుద్ధకాలం - యుద్ధ ప్రచారం సాగుతోంది. ఆ సమయంలోనే చాప్లిన్ ఎన్నో సభల్లో మాట్లాడాల్సి వచ్చింది. రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు నాజీ జర్మనీతో హోరాహోరీ పోరులో వున్నాయి. ఆ సందర్భంలో చాప్లిన్ ఒక ప్రచార సభలో 'కామ్రేడ్స్' అని సంబోధించాడు. జనం హర్షధ్వానాలు చేశారు. 'నా ఉద్దేశం కామ్రేడ్స్ అనే' అంటూ నొక్కించి మరీ చెప్పాడు. యుద్ధం ముగిసింది. అప్పుడు మొదలయ్యేయి చాప్లిన్ కష్టాలు. మిస్బారీ అనే అవిడతో ఆయనకి వున్న సంబంధాల గురించి ఒక కేసు నడిచింది. ఒక కేసంటూ మొదలైతే సూదికోసం సోదికి వెళ్లిన తంతుగా పోత గొడవల పీలికలు ఎన్నో ఇవతల పడ్తాయి. యుద్ధ ప్రచార సమయంలో 'కామ్రేడ్' అని వాడిన సందర్భాన్ని పైకి ఎత్తారు. చాప్లిన్ కమ్యూనిస్టు అని, 'ఫెలో ట్రావెలర్' అని ముద్రవేశారు. విచారణ జరిగింది. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్కి విపరీతమైన కమ్యూనిస్టు వ్యతిరేకత. ఛాప్లిన్ 'కామ్రేడ్' అనే పదాన్ని మామూలు అర్థంలో వాడేనని వివరించుకున్నా లాభంలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆయన ఆ దేశం వదిలిపెట్టి వెళ్లిపోవడం లాంటి విశేషాలన్నీ అందరికీ తెలిసినవే. కామ్రేడ్ అన్న సంబోధన కమ్యూనిస్టులకే పరిమితం అవడంతో ఆ పదాన్ని ఏ సందర్భంలో వాడినా అర్థం చేసుకునే తీరు భిన్నంగా ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక పోట్స్డామ్లో అగ్రనాయక సమావేశం జరిగింది. ట్రూమన్, చర్చిల్, స్టాలిన్లు పాల్గొన్నారు. అప్పుడు ఒక విందు జరిగింది. ఆ సందర్భంలో చర్చిల్ సోవియట్ సైనికాధిపతి మార్షల్ ఝుకోవ్కి టోస్ట్ ప్రతిపాదించాడు. దాంతో మార్షల్ ఝుకోవ్ కూడా చర్చిల్కి టోస్ట్ ప్రతిపాదించవలసి వచ్చింది. ఆయన