PAPAGNI KATHALU by DR.VEMPALLI GANGADHAR Telugu book cover

PAPAGNI KATHALU

by DR.VEMPALLI GANGADHAR

₹110
In stock · 335 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఈ కాలం సీమ సంక్షోభ ప్రతిఫలనం ఇవి ఈ కాలం సీమ కథలు. ఈ కాలం సీమ కథలు అనడం ఎందుకంటే ఇవి సమకాలీన రాయలసీమ నైసర్గిక, భౌగోళిక ప్రాంత జీవితాన్ని చిత్రిస్తున్నాయి. పర్యావరణ సంక్షోభాన్ని పట్టి చూపుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల క్షోభను, ఈ సీమలోని ప్రజాసముదాయాల బాధలను మన ముందుంచు తున్నాయి. వార్త దినపత్రికలో ప్రతి మంగళవారం 20 మే 2008 నుంచి 18 నవంబర్ 2009 వరకు వేంపల్లి గంగాధర్ రాసిన కాలమ్ కథల నుంచి ఎంపిక చేసిన లఘు కథలు ఇవి. ఈ కథల్లో కువైట్ ఇతర ప్రాంతాల వలసల బారిన పడిన కౌలురైతుల కల్లోలం మనకు కన్పిస్తుంది. నకిలీ పాస్పోర్ట్లు, ఏజెంట్, సస్ఏజెంట్ల మాయాజాలం ఒక వైపు, ఎయిడ్స్ బారిన పడిన తండా బిడికిలా అమ్మాయిల బాధలు, పెద్దాళ్ళ కింద నలిగిపోయే రజకుల కష్టాలు, నాణ్యతలేని విత్తనకాయలు, దక్కని ఎరువులు బారిన బడిన రైతుల గోడు, ప్రాజెక్టుల కింద పునరావాసం లభించని రైతులవ్యథలు మనల్ని వెంటాడుతాయి. ఇక్కడ ఈ సీమలో పంటల్లేవు, పైర్లులేవు, సాగునీరు లేదు. త్రాగు నీరు లేదు. కరెంటు లేదు. గొర్రెలకు దేశాటనం, పశువులకు కబేళాలు, యిక ప్రభుత్వ పథకాల గుట్టును కూడా గంగాధర్ ఈ కథల్లో రట్టు చేశాడు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎర్రచందనం దొంగ రవాణా సజావుగానే కొనసాగుతున్న విధానం గంగాధర్ చిత్రించాడు.