PARIPURNA VIKASANIKI DHYANAM by SWAMI SUKHABODHANANADA Telugu book cover

PARIPURNA VIKASANIKI DHYANAM

by SWAMI SUKHABODHANANADA

₹200
In stock · 3 available
PublisherSWAMI SUKHABODHANANADA
LanguageTelugu
ఎంపికలోనే ఉంది చిక్కు ఎంపిక లేక పోవడమే బ్రహ్మానందం సుఖశాంతులకు, సిరిసంపదలకూ పేరొందిన ఒకానొక గ్రామంలో ఒక అవ్వ జీవిస్తూ ఉండేది. ఆమె తెలివితేటలకు, జ్ఞానానికీ అందరూ ఆమెను గౌరవిస్తూ ఆమె పట్ల భక్తి ప్రపత్తులతో మెలుగుతూ ఉండేవారు. ఆమెను చూసి ఆ గ్రామప్రజలు అందరూ గర్వపడేవారు. ఆమె వల్లనే తాము సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉన్నామని ఆ ఊరి ప్రజలంతా నమ్మేవారు. ఒక రోజు అర్థ రాత్రి బిగ్గరగా ఒక కేక వినిపించింది. ఆకేకతో, ఆ ఊరి శాంతి, ప్రశాంతతకు భంగం కలిగింది. గ్రామ ప్రజలందరూ నిద్రలేచి తమ ఇళ్ళ నుండి బయటకు వచ్చారు. "నేను కాలిపోతున్నాను - నన్ను రక్షించండి" అనే కేక అందరూ విన్నారు. ఆ గొంతు అవ్వదేనని అందరూ గుర్తించి, మంట ఆర్పేందుకు అందరూ హుటాహుటిన తమ తమ ఇళ్ళనుండి బకెట్లతో నీరు తెచ్చారు. కాని తీరాచూసే సరికి, అక్కడ మంటగానీ, పొగగానీ కన్పించక పోవడంతో వారికి ఆశ్చర్యం కలిగింది. తాటాకుల పైకప్పుకాలిన వాసన కూడా రాలేదు. గుడిసె భద్రంగా ఉంది. తీరా గుడిసెలోనికి వెళ్ళిచూడగా, ఒక మూలన కళ్ళుమూసుకుకూర్చొని "రక్షించండి-నేను కాలిపోతున్నాను" అంటూ కేక పెడుతున్న అవ్వ కన్పించింది. ఆమెను గట్టిగా కుదిపి "నీవు అంటున్న మంట ఎక్కడుంది?" అని అడిగారు.