PARISHODHANA VIDHANAM - 100 by S.JAYAPRAKASH Telugu book cover

PARISHODHANA VIDHANAM - 100

by S.JAYAPRAKASH

₹100
In stock · 725 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
RESEARCH METHODOLOGY by Dr.S. Jayaprakash పుస్తకం గురించి ఈ పుస్తకం ప్రథమాధ్యాయంలో పరిశోధనా పద్ధతులు - పరిశోధనా లక్షణాలు, ఉత్తమ పరిశోధకుని లక్షణాలు, పరిశోధన క్రమం, వివిధ రకాల పరిశోధన దాని ఆవశ్యకత వివరణాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా పరిశోధనకు చిత్తశుద్ది అవసరమన్న విషయాన్ని ద్వితీయాధ్యాయంలో ప్రస్తావించారు. పరిశోధకునికి కావలసిన అర్హతలు, ఎదురయ్యే సమస్యలు మొదలైన శీర్షికలు బాగున్నాయి. మూడవ అధ్యాయంలో పరిశోధన ఏయే శాఖల్లో చేయవచ్చో చక్కని వివరణ చేశారు. దీనికి కావలసిన ఆధారాలు, పరిశోధనాంశం ఎంపిక, పరిశోధనలోని ప్రామాణిక నిరూపణ ఈ అధ్యాయం లోని విశేషాలు, నాల్గవఅధ్యాయం- ప్రణాళిక. దీన్నే సినాప్సిస్ అంటారు. 'ఔట్ లైన్స్ ఆఫ్ ది రీసెర్చ్ టాపిక్' అని కూడా పిలుస్తారు. దీని వివరణ వల్ల పరిశోధకునికి పరిశోధనాంశం పై ఒక అవగాహన ఏర్పడుతుందన్నమాట నిత్య సత్యం. ఐదవ అధ్యాయంలో ఊహా ప్రతిపాదన అంధకార ప్రపంచానికి వెలుగుబాట' అనే మాట సత్య నిరూపణం గావించారు. ఆధారం దొరకని సందర్భాల్లో పరిశోధకుని ఊహ ప్రతిపాదనం ఆమోదయోగ్యమయేలా నిరూపించడం మేదస్సుతో కూడిన పని. ఐదవ అధ్యాయం సామాగ్రి సేకరణం. 'తీగ దొరికితే డొంకంతా వెదకొచ్చ'న్న సామెత పరిశోధకుని విషయంలో వర్తిస్తుందని చెప్పవచ్చు. తరువాతి అధ్యాయం సామాగ్రి సంకలనం. ఇది నేర్పుతో కూడినపని. పరిశోధకుని అవగాహన మీద ఆధారపడి వుంటుందీ సంకలన విధానం. అనంతర అధ్యాయం సామాగ్రి సేకరణలోగల పద్ధతులను వివరించేది. సామాగ్రి సంకలనంలో ఎదురయ్యే సమస్యలు చదివినందువల్ల కొంత పరిష్కార మార్గం వెతికే అవకాశం కనిపిస్తుంది. ప్రతి విభాగానికీ చివర ఉపసంహారం చెప్పే పద్ధతి బాగుండి, దీనివల్ల ఆ విభాగంలోని విషయం మరొకసారి స్ఫురణకు వస్తుంది. ఈ పరిశోధన విధానం అన్న గ్రంథం చదివితే పరిశోధనలో ఒక అవగాహన ఏర్పడుతుంది. కేవలం పరిశోధకులకే కాక వ్యాస రచనలు చేసే వారికి కూడా ఉపయోగపడే వివరాలున్న ఈ గ్రంథం, రీసెర్చి స్కాలర్ల పరీక్షకు వెళ్లేవారికి కూడా ఉపకరిస్తుంది. (ఆంధ్రజ్యోతి సమీక్ష ఆధారంగా) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004