PARISODHANA PADDHATULU by GANDHAM APPARAO Telugu book cover

PARISODHANA PADDHATULU

by GANDHAM APPARAO

₹25
In stock · 73 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పరిశోధన పద్ధతులు పరిశోధన ఎందుకు చేయాలి? మానవుడు సంఘజీవి. సంఘాన్ని అనుసరించి అతడు జీవిస్తాడు. సంఘం కోసమూ జీవిస్తాడు. అనుక్షణం మారుతూ ఉండే ఈ సంఘ జీవితవిధానం సాధారణంగా మంచి వైపే సాగవచ్చు. ఒక్కొక్కప్పుడు మంచిలాగా కనిపించే చెడు వైపే నడవవచ్చు. కాబట్టి నిత్యమూ ఏది అనుసరణీయమో ఏది కాదో అనే విషయాన్ని గురించి వివేచన జరుగుతుండాలి. సంఘాన్ని అనుసరించే మనిషి తానుగా సంఘాన్ని కొత్తపుంతలో నడిపించడానికి యత్నిస్తాడు. ఒక్కోసారి ఆధారాలు లేనిదే, హేతుబద్ధమైన చర్చలేనిదే, పాతదాన్నైనా బహుళ ప్రచారంలో ఉన్నదాన్నైనా అతడు అంగీకరించడు. దేన్నీ విమర్శించి చూడకుండా స్వీకరించడు. ప్రశ్నించడం, తరచి తరచి, విడమరిచి చూడడం అతనికి చాలా అవసరం. సంబంధ, బాంధవ్యాలను చేసేటప్పుడు ఈ దృష్టి మరీ అవసరం. వారి గురించి ఎవరిని అడిగితే తెలుస్తుంది. ఎలా అడిగితే తెలుస్తుంది తెలుసుకోవాల్సిన విషయాలేమిటి?- ఇలా ముందుగానే అతడు స్థూలంగా అనుకోవాలి. ఈ పద్ధతినే విమర్శనా పద్ధతి అని లేదా పరిశోధనా పద్ధతి అనీ అనవచ్చు. ఈ పద్ధతి పరిశోధనకు భూమిక వంటిది. పరిశోధనా పద్ధతి మానవుణ్ని సత్యాన్వేషణాపరుడిగా చేస్తుంది. అసలు పరిశోధనకు సహాయకారులుగా ఒక్కొక్క అంశానికి సంబంధించిన పత్రికలు ఇప్పుడున్నాయి. సాంఘిక, వైజ్ఞానిక, చారిత్రక, రాజకీయాలకు సంబంధించిన పత్రికలు; భాషాశాస్త్రానికి, సాహిత్యానికి సంబంధించిన పత్రికలూ; యంత్ర నిర్మాణ విషయాలు తెలిపే పత్రికలూ; స్త్రీ సమస్యలను చర్చించే పత్రికలూ - ఇలా ఏ విషయం కావాలన్నా లభ్యమయ్యే పత్రికలున్నాయి. ఆయా విషయాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆలోచించి సిద్ధాంతాలు చేసిన గ్రంథాలనేక మున్నాయి. ఇవి ఆధారంగా ఇంకా అభివృద్ధి పొందడానికి చేసే ప్రయత్నాలూ ఆ ప్రయత్నాల ఫలితాల నివేదికా - పరిశోధన అనీ, పరిశోధన నివేదిక అనీ అంటాం. ఈ పరిశోధన అనేది సంఘ ప్రగతికి ప్రతీక. కనుకనే అన్ని విధాల వస్తూత్పాదక సంస్థలూ పరిశోధన, ప్రగతి (Research and development) అనే ఒక శాఖను ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. ఏదైనా ఒక విషయానికి సంబంధించిన విశిష్టాంశాలను క్రమపద్ధతిలో అన్వేషించడం, సమన్వయించడం, నూతనాంశాల నావిష్కరించడం అనేది పరిశోధన