
PARVADINALU PARAMARDHALU
by AYALASOMAYAJULA RAMA JOGARAO
₹300
In stock · 42 available
PublisherAYALASOMAYAJULA RAMA JOGARAO
LanguageTelugu
మనసులో మాట ... ప్రపంచ దేశాలన్నీ భారతదేశంవైపు తలవంచుకుని- తలదించుకుని చూస్తాయనడంలో అతిశ యోక్తిలేదు. ఎందుకంటే రంగమేదైనా శక్తివంతమైన దేశంగురించి చెప్పాలంటే, ఒక్క భారత దేశం గురించే చెప్పాలి చెప్పుకుంటారు. అంచెలంచెలుగా అంతలా ఎదిగి, మన ముందు అందరూ తలవంచుకునేలా చేసింది ఒక్కటే. అదే భారతీయతత్వం. ఏమిటా తత్వం? భారతదేశం ఇంతలా ఎదిగి, అత్యున్నత దేశమవడానికి బహుముఖకారణాలెన్నో వున్నా, వాటిలో సనాతన సంస్కృతీ-సాంప్రదాయాలు-ఆధ్యాత్మికత-భక్తిభావాలు దేశోన్నతికి ప్రాతిపదికలు. అందులో భారత దేశం మిళిత సంస్కృతీ-సాంప్రదాయాలమయం. ఎన్ని కులాలున్నాయో-మతాలున్నాయో-జాతులున్నాయో... అందరిని అన్నింటిని ఆదరించడం, అన్ని సంస్కృతీ-సాంప్రదాయాలను ఆచరించడం, సర్వమానవ ధర్మంగా ఈ దేశ ప్రజలు భావిస్తారు. అందుక్కారణం, సంస్కృతీ-సాంప్రదాయాల్ని నిలబెట్టేవి భారతీయ పండుగలు -పర్వదినాలే. క్రతువుల పుట్టినిల్లుగా, వేదసారం ప్రవహించిన వేదభూమిగా, మహాయోగు లు నడచి-తరించిన పుణ్యభూమిగా, పురాణేతిహాసాలు-భగవద్గీత పుట్టిన మహాపుణ్య క్షేత్రంగా, సనాతన సాంప్రదాయాలకు ఆధ్యాత్మిక భావాలకు ఆలవాలమై అత్యంత రమణీ య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన దేశమే మన భారతదేశం. లెక్కలేనన్ని పండుగలతో నిత్యం కళకళలాడుతూ కోలాహలంగా ఉండే దేశమిది. ఇక్కడ జరుపుకునే ప్రతీ పండుగ-పర్వ దినం, భగవంతుడిని-దేవతలను ఆరాదించడానికి ఉద్దేశించబడినవే. మహావిశాఖలో పుష్కరకాలం ఆంధ్రజ్యోతిలో సాంస్కృతిక విలేఖరిగా సేవలందించిన, నేను శాస్త్రీయ సంగీతం-సాహిత్యం...శాస్త్రీయ జానపద-గిరిజన-నృత్యాలు, లలిత కళలు ... పాశ్చాత్యకళలు, ఆయావాయిద్యాల గురించి 64కళల సమాహారంగా 'కళాసరిత్సాగరం' పుస్తకాన్ని వ్రాసి పాఠకులకు కళాకారులకు అందించాను. ఆ అనుభవంతో 'పర్వదినాలు-పరమార్థాలు' అనే పుస్తకాన్ని వ్రాయడానికి శ్రీకారంచుట్టాను. వీటిలో కొన్ని ఆంధ్రజ్యోతిలో ప్రచురితంకాగా మరికొన్ని ఎస్డివి, మీడియ విజన్ ఛానల్స్లో ప్రసారమయ్యాయి. ఏ యుగంలో చూసుకున్నా, ఏ తరంలో చూసుకున్నా భారతీయ పురాణాల్లో పొందు పరచిన పర్వదినాలన్నీ అపురూపమైనవేయని నా భావం. పర్వదినాల నిర్వహణలో పురా ణాల్లోని అర్థాలు-అంతరార్ధాలు- పరమార్థాలు-పురుషార్థాలు మానవాళికి అర్థమవడమే గాక సంస్కరిస్తాయన్నదికూడా నిజం. అందుకే పర్వదినాలు పాపాలనుకూడా హరించేవని తెలుసుకోవాలి. అటువంటి వివిధ పండుగలు-పర్వదినాలు, అర్థాలు-పరమార్థాల రహ స్యాలు, అంతర్యాలను సాధ్యమైనంత వివరణలతో అందించాలన్న సాహస ప్రయత్నమే ఈ 'పర్వదినాలు-పరమార్థాలు' అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని వ్రాయడంతో నేను అనుభవశాలిని-సంస్కృతాంధ్ర పండితుని, పరిశోధనా త్మక చదువులేవో చదివానుకోవద్దు. మా తండ్రి కీర్తిశేషులు అయలసోమయాజుల శంకర శాస్త్రిగారు సింహాచలం సంస్కృత పాఠశాల విద్యార్థి. పైగా ఉభయస్మార్త- వేదపండితులు. బహుభాషా ప్రావీణ్యులు.