PARYAVARANA SASTRAMU - SAVE NATURE by DR.THUMULURI RAJENDRAPRASAD Telugu book cover

PARYAVARANA SASTRAMU - SAVE NATURE

by DR.THUMULURI RAJENDRAPRASAD

₹125
In stock · 27 available
PublisherDR.THUMULURI RAJENDRAPRASAD
LanguageTelugu
ISBN9789353215910
పర్యావరణ శాస్త్రము కోకా మృత్యుంజయ రామ విశ్రాంత బి.ఎస్.ఎన్.ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీ పర్యావరణమే ఫ్లాట్ 404, కమలాక్షి రెసిడెన్సీ, బెండా కాంప్లెక్స్ వెనుక సర్పవరం జంక్షన్, కాకినాడ 53300E mrutyunjaya@hotmail.com Mob:9441214848 ముందుమాట మానవుడు పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి వున్నాడు. అనేక లక్షలు, కోట్లు సంవత్సరాలనుండి ప్రకృతిలో క్రమేపి అనేక మార్పులు జరుగుతూ మానవుని మనుగడకు కావలసిన సహజ వనరులన్నింటినీ సమకూర్చిన తరువాతే మానవుడు ఉద్భవించాడు. మిగతా ప్రాణులకు లేని బుద్ధి కుశలత, అవయవ నిర్మాణము మానవునికి వుంది. కానీ మానవుడు పూర్తిగా స్వార్ధపరుడయ్యాడు. ఆధునికత, అభివృద్ధి పేరున స్వార్ధంతో, పూర్తి వ్యాపా సరళితో జీవవైవిధ్యము, జీవావరణ వ్యవస్థ పర్యావరణానికి తీవ్రమైన చేటు చేస్తున్నాడు. ప్రాణాధారమైన నీటిక్ కటకట లాడుతున్నప్పటికీ తెలివి హీనంగా నీటివనరులు నాశనం చేస్తున్నాడు. అడవులను నాశనం చేస్తున్నాడు. ఒక్క చుక్క ఇంధనం తయారవటానికి అనేక లక్షల సంవత్సరాలు పట్టింది. అలాంటిది కొన్ని సెకన్లలోనే దానిని కాల్చేస్తున్నాడు. తూర్పుతీరం చాల సున్నితమైన జీవవైవిధ్యము కలిగిన ప్రాంతము తూర్పు తీర జీవావరణా వ్యవస్థ ప్రక ృతి వైపరీత్యాల నుండి కాపాడే విధముగ వుంది. ఇది పారిశ్రామీకరణ గ్లోబలైజేషన్ పేరున నాశనమవుతోంది. సముద్రానికి చెలియలి కట్ట ఎంతో ముఖ్యము. మడ అడవులు చిత్తడి నేలలతో పాటు చెలియలికట్ట కూడా తీవ్ర విధ్వంసానికి లోనవుతోంది. ఇదేవిధముగా నియంత్రణ లేకుండా కోనసాగితే ఈ చివరనుండి ఆ చివరవరకు తీరప్రాంత ప్రజల రక్షణ తీవ్రముగా కొరవడి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. మన తూర్పుతీర పరిస్థితి ఈ విధముగా ఉండగా, ప్రపంచ వ్యాప్తముగా గ్లోబల్ వార్మింగ్ మరియు సముద్రాల కాలుష్యము భవిష్యత్తులో మానవ మనుగడని సవాలు చేస్తోంది. భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటి? వీరిలో మనసంతతి కూడా ఉంటుంది. మన మునిమనవలు, వారి పిల్లలు కూడా వుంటారు. ఇవాళ మన అభివృద్ధి మన సంతానానికి శాపము కాకూడదు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజెప్పేందుకు తనవంతు ప్రయత్నంగా డా॥ తూములూరి రాజేంద్రప్రసాద్ గారు ఈ 'పర్యావరణ శాస్త్రము' గ్రంథాన్ని రచించారు. గతంలో 6 పుస్తకాలు పర్యావరణ పరిరక్షణపైనే రచించి సమాజానికి అందించారు. ఈ పుస్తకంలో చెట్ల పెంపకం-ఆవశ్యకత, అంతరించిపోతున్న మూగజీవులు, భూగర్భజలాల తరుగుదల, వర్షపునీటిని నిల్వచేసుకోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడానికి కారణాలు