PARYAVARANAM - PRAKRUTHI by DR.THUMULURI RAJENDRAPRASAD Telugu book cover

PARYAVARANAM - PRAKRUTHI

by DR.THUMULURI RAJENDRAPRASAD

₹150
In stock · 2 available
PublisherDR.THUMULURI RAJENDRAPRASAD
LanguageTelugu
ISBN9789354061493
పర్యావరణం - ప్రకృతి 1. భూతాపం ప్రాణానికే ముప్పు రోజురోజుకీ పెరిగిపోతున్న కర్బన ఉద్గారాల వల్ల సగటు ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. ప్రకృతి తనను తాను కాపాడుకోవడంతోపాటు ఈ విశ్వంలోని కోటానుకోట్ల జీవరాసులు (జంతువులు, వృక్షాలు) బ్రతికేందుకు తగిన వసతుల్ని కల్పిస్తోంది. ఈ ఉద్గారాల పెరుగుదల వల్ల ఉష్ణోగ్రతలు అధికమైతే ముప్పు తప్పదని Inter Governmental Panel on Climate Change (IPCC) హెచ్చరిస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాలపై దీని ప్రభావం మరింతగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. పోలెండ్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో IPCC ఇచ్చిన నివేదికపై చర్చ జరిగింది. ఈ నివేదికలో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు. 1) ఆసియా దేశాల్లోని కోల్కతా, కరాచీ వంటి నగరాలకు 2015లో వచ్చిన వడగాడ్పుల వంటి ముప్పు పొంచి వుంది. వాతావరణ మార్పుల వల్ల పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా మరణాలు అధికంగా ఉంటాయి. వ్యవసాయాధారిత దేశమైన భారతదేశం బాగా దెబ్బతింటుంది. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి. 2. సగటు ఉష్ణోగ్రతలు 1.5°C పరిమితికి లోబడి ఉండాలంటే కర్బన ఉద్గారాల మొత్తం 2030 నాటికి 45% తగ్గాలి. 2050 నాటికి సగటు ఉష్ణోగ్రతలు O°లకు చేరతాయి. 3. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక యుగం ప్రారంభం కావడానికి మునుపుతో పోలిస్తే 2°C లోపు ఉండేలా చూసుకోవాలి. 1.5°C కి మించకుండా చూసుకోవాలి అని ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ అవగాహనకు వచ్చాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 నాటికి సముద్రమట్టం