PATALA POODOTA VETURI by DR.VASILI VASANTA KUMAR Telugu book cover

PATALA POODOTA VETURI

by DR.VASILI VASANTA KUMAR

₹175
In stock · 1 available
PublisherYOGALAYA RESEARCH CENTRE
LanguageTelugu
ఎన్నటికీ రాలిపోని పాట అయినంపూడి శ్రీలక్ష్మి తేన తెగిన వీణియ గురించి, సంధ్యారాగం చంద్రహారాల గురించి, దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి కు గురించి, ఆరేసుకోబోయి పారేసుకుని, మాటే మణత్రమూ, మనసే బంధమూ అని విన్నవించుకున్న గీత రచయిత వేటూరి. వేణువై వచ్చి గాలిగా ఎగిరిపోయిన అక్షరఋషి తెలుగు సినిమా చరిత్రలోనే దాదాపు 5,000 పైచిలుకు పాటల్ని రాసి అత్యధిక పాటల్ని రాసిన రచయితగా రికార్డ్ సృష్టించిన గీతర్షి. భారతీయ చింతన, తెలుగు సంస్కృతి, మానవులలోని సార్వజనీన భావోద్వేగాల పరంపరలన్నింటికి వేటూరి పాట మంగళ తోరణాలు కట్టింది. మనిషి జీవితానికి సంబంధించిన అన్ని దశలలోని అన్ని రకాల మనోభావాలను పాటలుగా కట్టిన పదునైన కలం వేటూరిది. బహుశా ఇంత వైవిద్య భరితమైన పాటల్ని తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో మరెవ్వరూ రాయలేదేమో! అందుకే ఆయన పాటకి జాతీయస్థాయి పురస్కారం వచ్చింది. జాతీయస్థాయిలో తెలుగు సినిమా పాటకి ఉత్తమ గీతంగా పురస్కారాలు పొందిన మూడు పాటల్లో మూడూ వైవిధ్యభరితమైన గీతాలే. శ్రీశ్రీ "తెలుగు వీర లేవరా" పాట ఉత్తేజ భావాల ఉద్యమగీతం ! మూడోపాటైన "నేను సైతం" శ్రీశ్రీ పల్లవితో సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన ఉత్తేజగీతం ! వేటూరి రాసిన పాటలలోని వైవిధ్యతని గమనిస్తే పాటల ప్రపంచంలోకి ఆయన మనల్నందర్ని "టూరిజం"కి తీసుకెళ్ళారేమో అన్పిస్తుంది. ఇంకా చెప్పాలంటే పాటలనే వాహనాలుగా అలంకరించి "వేటూరిజంలోకి", తీసుకెళ్ళారేమో అన్పిస్తుంది. ఇక వేటూరి రాసిన పాటల్లో నవరసాలను, నవనవోన్మేష అనుభూతులను, అనుభవాలను అక్షరీకరించిన పాటలెన్నో వున్నాయి. ఆయన గీతంలో కరుణ కట్టలు తెంచుకుంది. రౌద్రం రంగులు మార్చింది. శాంతం శోభాయమానంగా కన్పించింది. భీభత్సం భూకంపాల్ని సృష్టించింది. శృంగారం బంగారు వర్ణమై మెరిసింది. హాస్యం హృదయ సీమలపై నవ్వుల విత్తనాలు మొలకెత్తించింది. ఇన్ని రసాలకు హారతి పట్టిన వేటూరి కలం జీవన తాత్వికతను సైతం అత్యద్భుతంగా ఆవిష్కరించింది. అలాంటి వాస్తవ తాత్విక విషాద గీతాలలో "ఆల్టై౦ గ్రేట్గా” నిలిచే పాట "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాట. వేటూరి రాసిన పాటల్లో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఐతే వాటన్నింటిలోనూ భావపరంగా, అర్థపరంగా, పదచిత్రాలు, ప్రతీకలపరంగా, తాత్వికత పరంగా తలమానికగా నిల్చేపాట “రాలిపోయే" పాట. వేటూరి పాటల సముద్రుడు. ఆయన రాసిన పాటల సాగరాన్నంతా దోసిళ్ళలో పట్టాలనేది ఎన్నాళ్ళుగానో నాలోని తపన ! ఆ తపనలోనే వేటూరి రాసిన పాటలన్నింటిని సారంగా నిలిచే "రాలిపోయే పువ్వా" పాటని ఒక కొత్తకోణంలో అర్థం చేసుకోవాలనే కోరిక కల్గింది. ఆ ప్రయత్నమే ఈ వ్యాసం. సందర్భం : రాలిపోయే పువ్వా పాట 1993లో వచ్చిన 'మాతృదేవోభవ' చిత్రంలోనిది. ఈ సినిమాకి కె.ఎస్. రామారావు నిర్మాత కాగా, కె. అజయ్కమార్ దర్శకత్వం వహించారు. గుండెల్ని తాకే సాహిత్యాన్ని వేటూరి అందించగా కీరవాణి ఈ పాటను స్వరపరిచారు. పైగా ఆర్ద్రంగా తానే గానం చేశారు కూడా ! ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ సాంగ్గా వచ్చే ఈ పాట ఈ సినిమాలోని కథానాయిక మాధవి పై చిత్రీకరించారు. దాదాపు నాలుగున్నర నిమిషాల నిడివిగల ఈ పాట, పాటలోని దృశ్యాలనీ అత్యంత కరుణ రసాత్మకంగా పాటలోని . -భావానికి తగిన డెప్త్ తెరకెక్కించారు. కథాపరంగా చూస్తే ఈ సినిమాలో హీరోయిన్ మరణానికి చేరువైన ముగ్గురు పిల్లల మాతృమూర్తి ! సంగీతం పాఠాలు చెప్పే టీచర్ కుటుంబ బాధ్యతల్ని మోసి, కన్నపిల్లల్ని మనసారా ప్రేమించిన అనుబంధాల దీప్తి ఆమె. పాటల పూదోట వేటూరి *