
PATRIKEYAM VYASIKALU SAMPADAKEEYALU
₹180
In stock · 129 available
PublisherVIRAT COMMUNICATIONS
LanguageTelugu
కథల్లో అయినా, పత్రికా రచనల్లో అయినా విశ్వనాథరెడ్డిది ఒకే దృక్పథం. శ్రమజీవుల పట్ల, మహిళల పట్ల వివక్ష, బాలల పట్ల క్రూరత్వం, మన ప్రభుత్వ యంత్రాంగంలో, విశ్వవిద్యాలయాల పరిపాలనలో కనిపించే బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థతా, అవినీతి, అలసత్వం ఆయనకు ఆగ్రహాం కలిగిస్తాయి. మన సమాజ భవిష్యత్తు పట్ల ఆందోళనకు గురిచేస్తాయి. ధర్మాగ్రహాన్ని మాట మీరకుండా, తక్కువ పదాలతో, సూటిగా, పాఠకులలో ఆలోచనను రేకెత్తించే తీరులో వ్యక్తం చేస్తారు. తెలుగు భాషమీద, ముఖ్యంగా తరతరాల జన జీవనాన్ని ప్రతిబింబించే నుడికారం మీద విశ్వనాథరెడ్డికి వున్న పట్టు - ఆయన పత్రికా రచనలు చదువుతుంటే మన భాష ఇంత రమ్యంగా, ఇంత పదునుగా ఉంటుందా అని ముచ్చటపడతాం. సమాజంలో ఇన్ని వర్గాల ప్రజలు, ఇన్ని కష్టాలు పడడానికి వ్యవస్థలోని లోపాలు, వ్యవస్థను తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని, స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకొంటున్న రాజకీయవాదులు, అధికారులు, బడావ్యాపారుల వికృత చేష్టలు కారణమని విశ్వనాథరెడ్డి రచనలు తేల్చిచెపుతాయి. ఈ దోపిడీ, ఈ అన్యాయం, ఈ బాధలు ఎప్పటికీ ఇంతేనా అన్న ఆవేదన ఆయన రచనల్లో వ్యక్తమవుతుంది.