
PAVITRA KUTUMBAM - THE HOLY FAMILY
₹325
In stock · 19 available
PublisherY.V.RAMANARAO
LanguageTelugu
మార్క్స్, ఎంగెల్స్ తొలి ఉమ్మడి రచన : పవిత్ర కుటుంబం 1845 లో రచించిన 'పవిత్ర కుటుంబం ' గ్రంథంలో మార్క్స్, ఎంగెల్లు యువ-హెగెలియన్లపై దాడిచేస్తూనే ఏకంగా హెగెల్ భావవాద తాత్వికత 'నే విమర్శనాత్మకంగా విశ్లేషిస్తారు. శ్రమ, శ్రామికులు, పామరులు, భౌతికవాదం, చరిత్రలను చులకనచేసే భావవాద రచనలపై గల భౌతికవాదుల ' విమర్శ లపై " ' విమర్శ 'నే ఒక మానవాతీత-శక్తిలోకి రూపాంతీక రిస్తూ ” బాయెర్ సోదరులు ' విమర్శనాత్మక విమర్శ ' చేస్తే, ఆ ' విమర్శనాత్మక విమర్శ'పై మార్క్స్, ఎంగెల్లు 'గుణదోష-విశ్లేషణ ’(critique) చేస్తారు. బాయెర్ విమర్శనాత్మక విమర్శ వాస్తవాన్ని తాత్వికత ద్వారా స్పష్టమైన హాస్యంలోకి వక్రీకరిస్తుందనీ, తద్వారా అది స్పెక్యులేటివ్ తత్వశాస్త్రంపై గల భ్రమల గురించి పామరులకు సైతం బోధనచేసేదిగా అవుతుందనీ చూపటమే ఈ గ్రంథ లక్ష్యం అంటారు మార్క్స్, ఎంగెల్స్ లు. ఈ గ్రంథంలో విమర్శ, అమూర్తీకరణ, హెగెల్ తాత్వికత, స్పెక్యులేటివ్ తత్వశాస్త్రం, స్వీయ-చైతన్యం, పవిత్రత, వ్యక్తి- పూజ/అనుసరణ, పరమాత్మ, సత్వాంశ, జీవాత్మ, పామరులు, మాస్ గురించీ; రాజకీయ, సామాజిక, మతపర, మానవ విమోచనాలు గల ' యూదు సమస్య ' గురించీ, మతం, దైవశాస్త్రం, భౌతికవాదం, రాజకీయార్థికశాస్త్రం, ప్రౌధాన్ గురించీ వుంటాయి. హెగెల్ తాత్వికతను ఖండించటంలో, భౌతికవాదానికి బలాన్ని చేకూర్చటంలో ఫోయర్బాక్ చేసిన కృషిని కూడా వారు వివరిస్తారు. పారిస్ మర్మాలు అనే ఫ్రెంచి నవల్లోని పాత్రల ' ప్రవర్తనల, స్వభావాల, మోహం, ప్రేమ, వేశ్యావృత్తి, వగైరాల 'లోని మార్మికతలు సమాజ వర్గ స్థితినుండే, ఆ నవలా రచయిత ' యూజినీ సూ' యొక్క వర్గ స్వభావంనుండే జనించి తీరతాయంటూ మార్క్స్ ఆ నవల్లోని సంభాషణలనుండే 'పవిత్ర కుటుంబం' గ్రంథంలో మూడోవంతు భాగంలో ఉదహరిస్తూ, విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ అద్భుత సామాజిక వాస్తవాన్ని ఆవిష్కరిస్తాడు. ఈ గ్రంథంలోని యూదు సమస్యపై మరింత స్పష్టమైన అవగాహనకై మార్క్స్ విడిగా రాసిన 'యూదు సమస్యపై' రచననూ, పవిత్ర కుటుంబం గ్రంథంలోని మార్క్స్ విమర్శకు జవాబుగా బ్రూనో బాయెర్ విడిగా రాసిన ' ప్రతి-విమర్శ 'కు మార్క్స్ రాసిన ' సమాధానా 'న్నీ అనువదించి ఈ తెలుగు ప్రతిలో అనుబంధాలుగా ఇవ్వడం జరిగింది. ' విమర్శ 'ను ఒక ప్రధాన భావంగా చేసిన బ్రూనో బాయెర్ను ' జర్మన్ భావజాలం గ్రంథంలో విమర్శిస్తూ మార్క్స్, ఎంగెల్లు శాస్త్రీయ భౌతికవాదాన్ని స్థాపించారు. అలా, ' విమర్శ 'పై అత్యంత విశిష్ట గ్రంథమైన ఈ 'పవిత్ర కుటుంబం 'కి ప్రాముఖ్యత ఉంది. ఈవిధంగా, భావవాద పోకడల్ని గిరాటేసి, భౌతికవాద దృష్టితో చరిత్రను శ్రమ, శ్రామికుల పునాదిపై నిలబెట్టి, వాస్తవాల ఆధారంగా అధ్యయనం చేస్తూ, ఆచరణకి వర్తింపజేయాలని ఈ గ్రంథంలో వారిచ్చిన పిలుపుని అందుకుని సాగిపోదాం.