
PEN DRIVE
by REHANA
₹200
In stock · 37 available
PublisherREHANA
LanguageTelugu
నా మాట నేను జర్నలిజం కోర్సులో చేరిన కొత్తలో జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ గుర్తు ఉంది. టీవీలో ఒక లీడర్ లేదా వ్యక్తి వాయిస్ బైట్ ఎంత సేపు ఉంటుంది అని ఫ్యాకల్టీ ప్రశ్నించారు. నాలుగైదు నిమిషాలు ఉంటుంది అనేశాను ఠక్కున. ఆయన నవ్వి ముప్పై సెకన్లు అన్నారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి లాంటి పెద్ద స్థాయి నాయకులు, లేదా చాలా కీలకమైన అంశం అయితే 40 నుంచి 45 సెకన్ల వరకు ఇవ్వొచ్చు అని చెప్పారు. జర్నలిజంలో ఓనమాలు నేర్చుకుంటున్న ఆ సమయంలో ఈ సమయ నిర్దిష్టత గురించి తెలుసుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యపోయనో, ఆ తర్వాత క్రమంగా అర్ధం అయ్యింది టీవీ మీడియాలో ప్రతి సెకన్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో. పరీక్షల్లోనూ అంతే కదా. ఒక నిమిషం, ఒక సెకను విలువ పరీక్ష హాల్లో కూర్చున్నపుడు ప్రతి విద్యార్ధికి అనుభవంలోకి వచ్చే అంశమే. టీవీ మీడియాలో పని చేసే జర్నలిస్టులకు ప్రతి రోజూ పరీక్షే. సెకన్ ముల్లుతో పోటీ పడుతూ పరుగెత్తాల్సిందే. ఎప్పుడైతే సమయానికి పరిమితి ఉంటుందో ఇచ్చే సమాచారానికి కూడా క్లుప్తత, నిర్దిష్టత అనే లక్షణాలు అలవడిపోతాయి. ఈ అంశమే వ్యాస రచన దిశగా నన్ను ప్రేరేపించింది. దీనితో పాటు కాలేజీ రోజుల నుంచి దిన పత్రికల్లో ఎడిటోరియల్స్, వ్యాసాలు చదవే అలవాటు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల పట్ల ఉన్న ఆసక్తి కూడా నిగూఢంగా ప్రభావం చూపించే ఉంటుంది. ఒక అంశం పై వ్యాసం రాయాలంటే ఆ అంశం గురించి మాత్రమే కాదు దాని నేపథ్యం కూడా తెలిసి ఉండాలి.