
PENAM MEEDA NUNDI POYYILO PADDAM
₹60
In stock · 244 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సుదీర్ఘకాలం నిరాదరణకు గురైన నవ్యాంధ్ర ప్రాంతం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందలాది కేంద్రప్రభుత్వ-ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ-ప్రభుత్వరంగ సంస్థలు, ఐ.టి. సంస్థలతో సహా పలు పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ఇక్రిశాట్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, మున్నగు అనేక ప్రసిద్ధి చెందిన సంస్థలు హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి అధికారం చేపట్టిన ప్రభుత్వాలు, హైదరాబాద్ అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించాయి. హైదరాబాద్లో నిమ్స్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, మున్నగునవి ఉండగా, ఆంధ్ర ప్రాంతంలో ఒక్కటి కూడా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోగడ ఏర్పడి వుండలేదు. హైదరాబాద్ నుండి విజయవాడ నేషనల్ హైవే కూడా 2014కు ముందు 2 లైన్ల జాతీయ రహదారిగానే ఉందన్న వాస్తవాన్ని మరువరాదు. అక్కడక్కడ కొద్ది సంఖ్యలో చక్కెర ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, జూట్ మిల్లులు లాంటివి కొద్ది సంఖ్యలో మాత్రమే నిర్మాణమయ్యాయి. విశాఖపట్నంలో మేజర్ పోర్టు ఉండుట వలన స్టీల్ ప్లాంట్, హెవీ ప్లేట్స్ & వెస్సల్స్ మున్నగు కొన్ని సంస్థలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతం లోని 17 పార్లమెంట్ సీట్లు తన పార్టీ ఖాతాలో పడతాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలంగాణలో తమ పార్టీ బలపడేందుకు అవకాశం కలుగుతుందని బి.జె.పి. భావించాయి. టి.డి.పి. లోని కొందరు టి.ఆర్.ఎస్. కోవర్టుల బ్లాక్మెయిలు జంకి టి.డి.పి. అధ్యక్షునిగా వున్న చంద్రబాబు “రెండు కళ్ళు" సిద్ధాంతంను తలకెత్తుకోవడం, ఎన్.టి. రామారావు, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న లాంటి ప్రజా నాయకులు లేకపోవడం, మరియు స్వాతంత్య్రానంతరం సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ నాటి నుండి జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపిన జస్టిస్ శ్రీకృష్ణ కమీషన్ రిపోర్టును సిఫార్సులను