
PETTUBADIDARI VIDHANAM OKA PRETATMA KKATHA
₹25
In stock · 1 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
పెట్టుబడిదారీ విధానానికి గొయ్యి తవ్వేది అంతిమంగా సిద్ధాంతాన్ని విశ్వాసంగా మార్చిన దాని మత గురువులే కావచ్చు. వ్యూహాత్మక తెలివితేటలు ఎంతగా ఉన్నా ఒక చిన్న వాస్తవాన్ని వాళ్లు గ్రహించలేక పోతున్నారు. పెట్టుబడిదారీ విధానం ఈ పుడమిని నాశనం చేస్తోంది. గతంలో సంక్షోభాలను ఎదుర్కోవటానికి ఉపయోగపడ్డ రెండు చిట్కాలు యుద్ధమూ, మార్కెటూ ఇక ఏ మాత్రం పనిచెయ్యవు. ముంబయిని చీకట్లు కమ్ముకుంటూ ఉండగా ఎత్తైన అంటిల్లా గేట్ల ముందుకి గంజిపెట్టిన చొక్కాలతో, వాకీటాకీలతో గార్డులు వచ్చారు. బహుశా దెయ్యాలను పారదోలటానికేమో కళ్లు మిరుమిట్లుగొలిపే లైట్లు వెలిగాయి. అంటిల్లా కాంతివంతమైన లైట్లు తమకు రేయిని లేకుండా చేస్తున్నాయి అని ఇరుగుపొరుగు వాళ్లు ఫిర్యాదు చేస్తున్నారు. మన రేయిని మనం తిరిగి స్వాధీనం చేసుకోటానికి సమయం ఆసన్నమైనట్లు ఉంది.