
PHIRANGI PANI PUB KATHALU
₹100
In stock · 42 available
PublisherKOUNDINYA PUBLISHERS
LanguageTelugu
ఫిరంగి పాని "పబ్ కెళ్ళడం ఎలా కుదురుతుంది... నేనొక్కణ్ణి కదా... జంటగా పోతేనే లోపలికి ఎంట్రెన్స్ కదా!” అన్నాను. "బిడ్డా! డబ్బులుండాలే గాని... నో ఎంట్రెన్స్ అన్నది లేదు. ఈ లోకంలో నో ఎంట్రన్స్ అన్నది... డబ్బు లేనోడికే గాని... ఉన్నోడికి కాదు" బోధకుడయ్యాడు శివ "అదికాదురా... పబ్ కెళ్ళాలంటే టిషర్ట్... జీన్స్... షూస్... పక్కన అమ్మాయి లేనిదే రానివ్వరట కదా... అందులో నాకు ఏ ఒక్కటీ లేవు కదా!" అన్నాను తను వెసులుబాటుగా ఏదైనా చెబుతాదేమోనని గుడ్లు మిటకరిస్తూ... శివకళ్ళలోకి చూస్తూ... "నాన్నా! ఒకటి కావాలంటే... ఒకటి కోల్పోక తప్పదు... అన్నారు పెద్దలు... ఒక్కటి కోల్పోతే చాలు... అదీ తాత్కాలికంగా... అన్ని లభ్యమవుతాయి అంటాడు ఈ శివుడు" అన్నాడు శివ 'తాత్కాలికంగా' అన్న పదాన్ని వత్తి పలుకుతూ “ఏమిటి కోల్పోతే... తాత్కాలికంగా" అన్నాను. "డబ్బు" శివ "కోల్పోవడమే కదా! మళ్ళీ దానికి... 'తాత్కాలికంగా"... అంటావేమిటి?" అడిగాను