PIBARE RAMARASAM by PUVVADA THIKKANA SOMAYAJI Telugu book cover

PIBARE RAMARASAM

by PUVVADA THIKKANA SOMAYAJI

₹200
In stock · 26 available
PublisherPUVVADA THIKKANA SOMAYAJI
LanguageTelugu
పిబరే రామరసమ్ పద్య కావ్యం పువ్వాడ తిక్కన సోమయాజి "పిబరే రామరసం" భక్తి ప్రధానమైన రచన. ఇది నవీనుల ఖండకావ్యం వలె వివిధ శీర్షికలతో ప్రకాశించే అఖండ కావ్యం. రామాయణ కథ కనుక కాండములను కవి వదలలేదు. ఇది వాల్మీకమునకు కేవలానువాదంకాదు. అవారిత సత్కవి కల్పనా విభూషావహ పూర్వవృత్తమిది. సానపెట్టిన జాతిరత్నము. మరి - కవి నిరంకుశుడు, సర్వస్వతంత్రుడు కనుక రచనాధోరణిలో, కథ నడపటంలో, పాత్రలను తీర్చిదిద్దటంలో ఆ వైఖరి పదపదానా భాసిస్తున్నది. - శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు (కుర్తాళం) రామాయణంలోవి అన్నీ రసవచట్టాలే అయినా కొన్నిటిని యిలా రసోల్బణాలుగా పండించి మాకు పంచిన తీరు చాలా సొగసుగాను, గడుసుగాను ఉంది. వసంతవర్ణనం కథతో లీనమై మీ పేరులోని కవిగారి కవితాశైలిని స్ఫురింపజేసింది. హనుమను ప్రవేశపెట్టిన తీరు, అతడి మహిమానుభావ వర్ణన సర్వంకషంగా ఉంది. 'ఆచార్య' బేతవోలు రామబ్రహ్మం అలనాటి పునరుజ్జీవనం (రినైజాన్స్) కాలంనాటి 'లిరిక్' కవిత్వ ధోరణి ఇది. దీనిలో ఐతిహాసికత నాటకీయత, గాయకత కలిసి నడుస్తాయి. పాత్రల స్వరూప స్వభావాల్ని పోల్చుతూ ఒక్కపద్యంలో బాహ్యాంతర స్థితుల్నీ గతినీ బొమ్మకట్టించే నేర్పు సోమయాజి గారిది. వీరి శబ్దశక్తి దొడ్డది; మధురమైన పదజాలం, భాషాప్రౌఢిని పలుపట్టుల్లో గుప్పించారు; రచనాశిల్పం తెలిసినవారు; కావ్యకళ వారికి స్వాయత్తమైన రసవిద్య! - జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి “విహారి”